Job Mela Stampede: ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించేందుకు నిర్వహించిన జాబ్ మేళాలో భయానక పరిస్థితి ఏర్పడింది. ఊహించని రీతిలో నిరుద్యోగులు పోటెత్తారు. వేలాది మంది తరలిరావడంతో కన్వెన్షన్ హాల్ కిక్కిరిసింది. లోపలికి వెళ్లేందుకు ఒక్కసారిగా ఎగబడడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. గందరగోళ పరిస్థితిలో కొందరు కిందపడగా వారిని తొక్కుకుంటూ మరికొందరు వెళ్లారు. ఈ సంఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క పాల్గొన్నారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Kancha Gachibowli: సల్మాన్ ఖాన్‌లాగా మూడు జింకలు చంపిన రేవంత్ రెడ్డిపై చర్యలు ఏవి?
వరంగల్‌లోని ఎంకే నాయుడు కన్వెన్షన్‌లో శుక్రవారం మెగా జాబ్‌మేళా నిర్వహించారు. హైదరాబాద్, వరంగల్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న 50 కంపెనీల్లో ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్‌మేళా చేపట్టారు. కొన్ని రోజుల ముందు నుంచే విస్తృతంగా ప్రచారం కల్పించడంతో పెద్ద ఎత్తున నిరుద్యోగులు పాల్గొన్నారు. అయితే నిర్వాహకులు ఊహించని స్థాయి కంటే వేలాది సంఖ్యలో నిరుద్యోగులు తరలిరావడంతో కన్వెన్షన్ సెంటర్ కిటకిటలాడింది.
Also Read: Colleges Bandh: రేపు తెలంగాణలో కళాశాలల బంద్.. ఎందుకో తెలుసా?
దరఖాస్తులు.. రెజ్యుమ్‌లు తీసుకునేందుకు ఎగబడ్డారు. కన్వెన్షన్ సెంటర్ తలుపులు తెరవగా ఒక్కసారిగా నిరుద్యోగులు లోపలికి వెళ్లడంతో కొంత గందరగోళం ఏర్పడింది. ఒకరినొకరు తోసుకుంటూ వెళ్తుండడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో కొందరు నిరుద్యోగులు కిందపడిపోయారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. గందరగోళ పరిస్థితితోపాటు భయాందోళన నెలకొనడంతో వెంటనే ఫంక్షన్ హాల్ ప్రధాన ద్వారం అద్దాలు ధ్వంసం చేశారు. అనంతరం వారిని సురక్షితంగా బయటకు వెళ్లేలా ప్రయత్నించారు. అయితే ఈ తొక్కిసలాటలో ముగ్గురు మహిళ అభ్యర్థులకు గాయాలయ్యాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు కొండా సురేఖ, సీతక్క హాజరయ్యారు.
మంత్రుల నిర్లక్ష్యం
మంత్రులు ప్రసంగించి వెళ్లే వరకు నిరుద్యోగులను లోపలకి రానీవకపోవడంతో తొక్కిసలాటకు కారణంగా తెలుస్తోంది. గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. అయితే ప్రజా ప్రభుత్వం అని గొప్పగా చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి పాలనలో ఈ స్థాయిలో నిరుద్యోగులు తరలిరావడం విస్మయానికి గురి చేస్తోంది. ఈ తొక్కిసలాటపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపట్టకపోగా.. నిర్వహించే ప్రైవేటు ఉద్యోగాల భర్తీ కూడా ఇంత దారుణ స్థాయిలో నిర్వహించడంపై బీఆర్‌ఎస్ పార్టీ తప్పుబడుతోంది. కాగా తొక్కిసలాట సంఘటన తెలిసినా కూడా కొండా సురేఖ, సీతక్క పట్టించుకోలేదని.. వారి తీరుపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









