Colleges Bandh: రేపు తెలంగాణలో కళాశాలల బంద్.. ఎందుకో తెలుసా?

Tomorrow Colleges Holiday A Head Of Professors Protest In 12 Universities: తెలంగాణలో విద్యార్థులకు అలర్ట్‌. రేపు కళాశాలలు బంద్‌ ఉండనున్నాయి. ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఆందోళన చేపట్టడంతో రేపు యూనివర్సిటీల బంద్‌ చేపట్టారు. ఆ బంద్‌తో రాష్ట్రవ్యాప్తంగా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలు మూత పడనున్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 9, 2025, 10:44 PM IST
Colleges Bandh: రేపు తెలంగాణలో కళాశాలల బంద్.. ఎందుకో తెలుసా?

Colleges Holiday: విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌ రేపు కళాశాలలు బంద్‌ ఉండనున్నాయి. తమకు చదువులు చెప్పే బోధకులు ఆందోళన చేపడుతుండడంతో తెలంగాణవ్యాప్తంగా కళాశాలలు బంద్‌ ఉండనున్నాయి. రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాలన్నీ మూత పడనున్నాయి. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసనకు దిగగా పోలీసులు దుర్మార్గంగా వ్యవహారించడంతో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు యూనివర్సిటీల బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వర్సిటీలు బంద్‌ కానున్నాయి.

Add Zee News as a Preferred Source

Also Read: Bank Holiday: రేపు బ్యాంకులకు సెలవు.. ప్లాన్‌ చేసుకుంటే ఏకంగా ఐదు రోజుల సెలవులు

తమ డీఏలు, పీఆర్‌సీ, హెచ్‌ఆర్‌ఏ ప్రకటించాలని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆందోళన చేపట్టగా వారిపై పోలీసులు దాడి చేసి అరెస్ట్‌ చేశారు. జీఓ నంబర్ 21ను రద్దు చేయాలని డిమాండ్‌తో చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ప్రభుత్వంపై మండిపడ్డారు. వారి అక్రమ అరెస్టులను ఖండిస్తూ దానికి నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 విశ్వవిద్యాలయాల్లో బంద్‌కు పిలుపునిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అసోసియేషన్ సభ్యులు ప్రకటించారు. వీరి బంద్‌ పిలుపుతో రాష్ట్రంలోని యూనివర్సిటీ పరిధిలో ఉన్న పీజీ, డిగ్రీ కళాశాలలు బంద్‌ కానున్నాయి.

Also Read: America vs China Tariff War: అమెరికాకు చైనా భారీ షాక్‌.. 80 శాతం టారిఫ్‌లు పెంచిన డ్రాగన్‌ దేశం

రానున్న రోజుల్లో ప్రభుత్వం తమకు అనుకూలంగా ప్రకటన ఇవ్వని పక్షంలో 12 యూనివర్సిటీలను స్తంభింపచేస్తామని కాంట్రాక్ట్‌ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ సంఘం హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జీవో నంబర్ 21ను రద్దు చేయాలని సంఘం డిమాండ్ చేసింది. కాంట్రాక్ట్‌ అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలని ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు. అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు బేసిక్, డియర్‌నెస్‌ అలవెన్స్‌, హెచ్ఆర్ఏ, 3 శాతం ఇంక్రిమెంట్‌తో కూడిన స్కేల్‌ను అమలుచేయాలని కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు డిమాండ్ చేశారు. ఈ బంద్‌లో బోధన సిబ్బందితోపాటు బోధనేతర సిబ్బంది కూడా పాల్గొననున్నారని ప్రకటించారు.

కొన్నేళ్లుగా విశ్వవిద్యాలయ ఉద్యోగులు, కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. ప్రభుత్వం నుంచి డియర్‌నెస్‌ అలవెన్స్‌ పెండింగ్‌లో ఉండగా.. వేతనాల పెంపు, హెచ్‌ఆర్‌ఏ పెంపుపై యూనివర్సిటీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఆ సమస్యలు పరిష్కరించాలని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు నిరసన బాట పట్టారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News