Summer Effect: తెలంగాణలో మాడు పగిలే ఎండలు.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..

Summer Effect: తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల తీవ్రత చూస్తుంటే వచ్చే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి తలుచుకునేందుకు ప్రజలు భయపడుతున్నారు.  రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో  సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 14, 2025, 08:20 AM IST
Summer Effect: తెలంగాణలో మాడు పగిలే ఎండలు.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..

Summer Effect: భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. మార్చిలోనే మాడు పగులుగొడుతున్నాడు. రాబోయే రెండు నెలలు తలుచుకుంటేనే భయం వేస్తోంది.  రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకి పెరిగిపోతుండగా.. పగటి ఉష్ణోగ్రతలు అప్పుడే 40 డిగ్రీలు దాటేశాయి. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో గురువారం 40 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతేడాది ఇదే రోజు కేవలం రెండు జిల్లాల్లోనే 40 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే.. ఈ సారి వాతావరణంలో మార్పుల కారణంగా ఈ సారి గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలున్నాయి.

Add Zee News as a Preferred Source

నిన్న నిర్మల్‌జిల్లా కడ్డం పెద్దూర్‌ మండలం లింగాపూర్‌లో గురువారం రాష్ట్రంలోనే అత్యధికంగా 40.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో రానున్న  రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.  ఈ క్రమంలోనే ఇవాళ రేపు పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది.  

మిగిలిన జిల్లాలకు యెల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు సగటున 38-41 డిగ్రీల మధ్య, రాత్రిపూట 19-23 డిగ్రీ ల మధ్య నమోదయ్యే అవకాశముందని వాతావరణ కేంద్రం పేర్కొంది. రాత్రిపూట ఉక్కబోతకు ప్రజలు అల్లాడుతున్నారు. మరోవైపు ఎండ వేడమి నుంచి ఉపశమనం పొందేందకు ఏసీలతో పాటు కూలర్స్ ను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా రాజస్థాన్ తో పాటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి వీచే వేడి గాలుల వల్ల కూడా ఎండ వేడిమి పెరిగే అవకాశాలున్నాయి. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందకు రాగి జావతో పాటు చల్లటి మజ్జిగ లేదా కొబ్బరి బొండాల వల్ల ఎండ వేడిమి వల్ల ఒంట్లో నుంచి చెమట రూపంలో బయటకు వచ్చే లవణాలు లభ్యమవుతాయి. మరోవైపు కూల్ డ్రింక్స్ ను ఎట్టి పరిస్థితుల్లో తాగకూడదు.

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News