Summer Waves: అడుగు బయట పెడితే ఆగమే.. అవును ఈ యేడాది రికార్డు స్థాయిలో ఎండలు మండిపోనున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో సూర్యుడి భగభగలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెలలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదు అవుతున్నాయి.
సాధారణం కన్నా 3.5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ కేంద్ర అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా రాజస్థాన్ నుంచి వీచే వేడి గాలులతో గాలిలో తేమ శాతం పడిపోనుంది. ప్రధానంగా కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది.
పలు జిల్లాల్లో వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది.. ఉత్తరాంధ్రలోని పార్వతీపురం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో వేడిగాలులు వీస్తున్నాయి. మరోవైపు నిన్న భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు హైదరాబాద్ లోని పలు ఏరియాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో అత్యవసర పరిస్థితుల్లో కానీ బయటకు రావొద్దని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.








