Summer Waves In Two Telugu Stateas: వాయువ్య రాష్ట్రాల నుంచి వీస్తోన్న వేడి గాలులతో తెలుగు రాష్ట్రాలు అట్టుడికి పోతున్నాయి. నిన్న అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. జగిత్యాల జిల్లా గోధూరు, గద్వాలలోని మల్దకల్, మంచిర్యాలలోని జానకాపూర్, నల్గొండలోని దామరచర్ల, నిజామాబాద్‌లోని ధర్పల్లిలో 40.9 డిగ్రీల చొప్పున ఉష్టోగ్రతలు నమోదు అయ్యాయి. మరో నాలుగు జిల్లాల్లో 40.8, మూడు జిల్లాల్లో 40.7 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డయ్యాయి. ఒక్క హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 39.7 డిగ్రీలు రికార్డయింది. మరో రెండు మూడ్రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 25 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఈ రోజు ఆయా జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత రెండ్రోజులకు ఉష్ణోగ్రతలు కొంచెం తగ్గుముఖం పట్టొచ్చని చెప్పింది. ఏప్రిల్ 2, 3వ తేదీల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దేశంలో ఎండలు మండిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. అన్ని రాష్ట్రాలకూ హీట్‌వేవ్ అలర్ట్ అడ్వైజరీ జారీ చేసింది. ఎండ ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు వడగాడ్పులను అంచనా వేస్తుండాలని సూచించింది. హీట్ వేవ్స్ పై వెంటనే యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేయాలని, వాటి వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై బులెటిన్స్ ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లేఖ రాశారు.
మెడికల్ ఆఫీసర్లు, హెల్త్ స్టాఫ్ సంఖ్యను పెంచాలని సూచించారు. వడదెబ్బకు గురైన పేషెంట్లకు చికిత్స అందించేలా హాస్పిటళ్లను సిద్ధం చేయాలన్నారు. అందుకు అనుగుణంగా వసతులు కల్పించాలని ఆదేశించారు. యాక్టివ్, ఎమర్జెన్సీ కూలింగ్ పరికరాలను ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయాలన్నారు. ఎండాకాలంలో అగ్నిప్రమాదాలు సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, ఆస్పత్రుల్లో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
మరోవైపు ఏపీలో ఎండలు మండుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, కోస్తాలో వేడిగాలులు సెగలు పుట్టిస్తున్నాయి. ఇవాళ 35 మండలాల్లో తీవ్రంగా, శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు 223 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్న సమయంలో ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని అధిరకారులు సూచిస్తున్నారు. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మెసేజ్‌లో అలర్ట్ చేస్తున్నారు. ఇలా వుండగా నిన్న ప్రకాశం జిల్లా తాటిచెర్ల, కడప జిల్లా కమలాపురంలో 42.6 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయ్యింది.
ఇదీ చదవండి: Madhuri Dixit Love Affair: ప్రముఖ క్రికెటర్ తో మాధురి దీక్షిత్ లవ్ ఎఫైర్.. ఎందుకు బ్రేకప్ అయిందంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









