Supreme Court: 10 మంది బీఆర్ఎస్ రెబల్ ఎమ్మెల్యేలపై సుప్రీం సీరియస్..

Supreme Court: తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని  అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. బీఆర్ఎస్ గతంలో ఎలాంటి తప్పు చేసిందో.. అదే తప్పును ఆ పార్టీ అధినేత రేవంత్ చేసారు. ప్రతిపక్ష పార్టీలోని ఎమ్మెల్యేలను చీల్చి తన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ కోర్టు గడప ఎక్కింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 12, 2025, 03:04 PM IST
Supreme Court: 10 మంది బీఆర్ఎస్ రెబల్ ఎమ్మెల్యేలపై సుప్రీం సీరియస్..

Supreme Court: తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి  పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఈ రోజు  మరోసారి జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే, ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలంటూ ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌కు నోటీసులు అందిన విషయం తెలిసిందే కదా.

Add Zee News as a Preferred Source

అదేవిధంగా అసెంబ్లీ సెక్రటరీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు, పార్టీ మారిన 10 మంది బీఆర్ఎస్ రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా పిటిషన్‌పై మరోసారి విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నోటీసులు అందుకున్న వారు ఈ నెల 25లోగా ఎట్టి పరిస్థితుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.  

కాగా, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ లో చేరిన మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ.. జనవరి 15న బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే అందులో గూడెం మహిపాల్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు మరోసారి ఘర్ వాపసీ అనే రీతిలో బీఆర్ఎస్ చూపులు చూస్తున్నారు. ఇందులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు పడే అవకాశాలున్నాయి. ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ  కాంగ్రెస్ పార్టీ తరుపున సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిన సంగతి తెలిసిందే కదా. దీంతో ఆయనపై అనర్హత వేటు పడటం ఖాయం అనే ముచ్చట వినబడుతుంది. మరోవైపు మిగిలిన ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో  ఎలాంటి పరిణామం చోటు చేసుకుంటుందో చూడాలి.

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News