Supreme court dismisses bc reservations: తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనపై సుప్రీం కోర్టులో ప్రభుత్వానికి ఊరట లభించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం జీవో 9 జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ వంగ గోపాల్ రెడ్డి పిటిషన్ వేశారు.
ఇక బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. హైకోర్టులో కేసు విచారణలో ఉండగా మళ్లీ ఇక్కడకు ఎందుకు వచ్చారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తెలంగాణ హైకోర్టులో స్టే ఇవ్వడానికి నిరాకరించిందని బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసిన లాయర్ తెలిపారు.
అయితే, హైకోర్టులో స్టే ఇవ్వడానికి నిరాకరిస్తే ఇక్కడకు వస్తారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. బీపీ రిజర్వేషన్లపై హైకోర్టుకే వెళ్లాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు కేసు డిస్మిస్ అని చెప్పడంతో.. పిటిషనర్ తరపు న్యాయవాది ఈ కేసును వెనక్కి తీసుకునేందుకు అంగీకరించారు.
తెలంగాణలోని బీసీ రిజర్వేషన్ల అంశం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% మించి రిజర్వేషన్లు అమలు చేయబోతున్నారని వంగా గోపాల్ రెడ్డి పిటిషన్ వేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ అంటోంది.
Also Read: Jobs: నిరుద్యోగులరా గెట్ రెడీ.. తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు..!
Also Read: Tomato Rates: టమాటా ధరలు ఢమాల్.. ఒక్కసారిగా పడిపోయిన రేట్లు.. కిలో ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









