Supreme Court: గడువు ముగిసేవరకు ఆగుతారా, ఈసీ, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ

Supreme Court: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై ఇవాళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గడువు ముగిసే వరకు కాలయాపన చేస్తారా అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 4, 2025, 05:18 PM IST
Supreme Court: గడువు ముగిసేవరకు ఆగుతారా, ఈసీ, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ

Supreme Court: ఇవాళ మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ వైఖరిపై గర్హించిన సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ, ఎన్నికల సంఘం, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మార్చ్ 22 వరకూ సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. 

Add Zee News as a Preferred Source

తెలంగాణలోని పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టులో జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, స్పీకర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రతిసారీ రీజనబుల్ టైమ్ కావాలని ప్రభుత్వం కోరుతుండటంతో సుప్రీంకోర్టు మండిపడింది. రీజనబుల్ టైమ్ అంటే గడువు ముగిసే వరకా అని అసహనం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్య విధానాలు ఏం కావాలని ప్రశ్నించింది. ఇంకా ఎంత సమయం కావాలో చెప్పాలని కోరింది. ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డెడ్ అనే తీరు మంచిది కాదని జస్టిస్ బీఆర్ గవాయి చెప్పారు. 

బీఆర్ఎస్ తరపున సీనియర్ న్యాయవాది అర్యమ సుందరం వాదనలు విన్పించారు. ప్రతిసారీ కావాలనే ఆలస్యం చేసే ఎత్తుగడలు అనుసరిస్తున్నారని కోర్టుకు తెలిపారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారారంటూ స్పీకర్‌కు ఫిర్యాదు చేసి ఏడాది గడిచిందని, ఇదే అంశంపై తెలంగాణ హైకోర్టులో కూడా విచారణ జరిగిందని వివరించారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ రివర్స్ చేసిందన్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడం అంటే రాజ్యాంగం ఇచ్చి విధుల నిర్వహణలో విఫలమైనట్టేనన్నారు. 

సరైన సమయం అంటూ స్పీకర్ కాలయాపన చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మహారాష్ట్ర తరహాలో ఎమ్మెల్యేల పదవీకాలం పూర్తయ్యేవరకు ఆగుతారా అంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే అంశంపై మార్చ్ 22 వరకు సమాధానం ఇవ్వాలంటూ తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ, ఎన్నికల సంఘం, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. విచారణను మార్చ్ 25కు వాయిదా వేసింది.

Also read: ICAI CA Results 2025: సీఏ ఇంటర్ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News