Telangana MLAs Defection Case: తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత .. ప్రత్యర్థి పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీని చీల్చే పనిలో పడ్డారు. అంతేకాదు ఆ పార్టీలోకి మూడింటి రెండొంతలు మందిని కాంగ్రెస్ పార్టీలోకి ఆకర్షించాలని చూసినా.. పెద్దగా వర్కౌట్ కాలేదు. కేవలం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఈ ఫిరాయింపులపై బీఆర్ఎప్ కోర్టు కెక్కింది. తాజాగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు గత కొంత కాలంగా కోర్టులో నానుతుంది. తాజాగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలపై ఈరోజు సుప్రీం కోర్టులో కీలక విచారణ జరగనుంది. గత విచారణలో స్పీకర్‌తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు. దీంతో ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నోటీసులు అందించింది.
10 నెలలు దాటినా ఎందుకు పార్టీ ఫిరాయింపులపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని స్పీకర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. అంతేకాదు నిర్ణీత గడువులోగా తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.ఆధ్వర్యంలోని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. బీఆర్ఎస్ గతంలో ఎలాంటి తప్పు చేసిందో.. అదే తప్పును ఆ పార్టీ అధినేత రేవంత్ చేసారు. ప్రతిపక్ష పార్టీలోని ఎమ్మెల్యేలను చీల్చి తన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ కోర్టు గడప ఎక్కింది.
భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ లో చేరిన మొత్తం 10 మంది శాసన సభ్యులను డిస్ క్వాలిఫై చేయాలని కోరుతూ జనవరి 15న బీఆర్‌ఎస్ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇప్పటికే అందులో గూడెం మహిపాల్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు కొందరు సొంత పార్టీ వైపు అడుగులు వేసే పనిలో పడ్డారు. ఇందులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే.. కాంగ్రెస్ పార్టీ తరుపున గత లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిన సంగతి తెలిసిందే కదా. దీంతో ఆయనపై అనర్హత వేటు పడటం గ్యారంటీ అని చెబుతున్నారు. మరోవైపు మిగిలిన ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో ఎలాంటి పరిణామం చోటు చేసుకుంటుందో వెయిట్ అండ్ సీ.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









