)
Supreme court on BC Reservations: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై హైకోర్టు స్టే విధించింది. దీంతో ఎన్నికల సంఘం ఇచ్చిన నోటిఫికేషన్ వెనక్కి తీసుకుంది. మరోవైపు హైకోర్టు పాత రిజర్వేషన్ల ప్రకారం 50 శాతం మించకుండా ఎన్నికలకు వెళ్లవచ్చని చెప్పింది. దీంతో ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు గడప తొక్కింది. ఈ నేపథ్యంలో ఈ రోజు కోర్టులో ఇది విచారణకు రానుంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు తీర్పును సమర్ధిస్తుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది.
ఒకవేళ కోర్టు తీర్పు ప్రతి కూలంగా వస్తే తర్వాత ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై చర్చించేందుకు మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మరవైపు పీసీసీ నేతలు పలుమార్లు ఈ ఎన్నికలు నిర్వహించిన తీరుతామని ప్రకటించిన నేపథ్యంలో.. మంత్రివర్గం ఏయే నిర్ణయాలు తీసుకుంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా కొన్ని గంటల్లో బీసీ రిజర్వేషన్లు, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 9పై తెలంగాణ హైకోర్టు ఈ నెల 9న స్టే విధించిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెష ల్ లీవ్ పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు రానుంది. తెలంగాణలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియ శాస్త్రీయంగా, చట్టబద్ధంగా, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు తగ్గట్లుగానే జరిగిందని ఈ పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. మొత్తంగా బిసీ రిజర్వేషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.