MLA Defection Case:బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టు గడప తొక్కింది. దీనిపై గడువును మరో వారం రోజులు పొడిగించాలని స్పీకర్ కార్యాలయం మరో పిటిషన్ దాఖలు చేసింది. ఈ రెండు పిటిషన్లు కలిపి సీజేఐ (ఛీప్ జస్టిస్ ఆఫ్ ఇండియా) ధర్మాసనం ఇవాళ విచారించింది. ఈ నెల 24న సీజేఐ బీఆర్ గవాయ్ పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తీర్పుపై ఫిరాయింపు ఎమ్మెల్యేలలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే శాసన సభ్యుల అనర్హత పిటిషన్ ను స్పీకర్ ఇంకా తేల్చలేదు. ఈ విచారణలో ఎమ్మెల్యేల న్యాయవాదులు, పిటిషనర్ల న్యాయవాదులు తమ వాదనలను స్పీకర్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.
ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ .. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసారు. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ పై ముందుగా అనర్హత వేటు పడే అవకాశం ఉంది. అయితే పది మంది ఎమ్మెల్యేల అనర్హత వేటు పై సుప్రీంకోర్టులో మూడు వేర్వేరు పిటిషన్లు ఇప్పటికే దాఖలయ్యాయి.
ఇప్పటికే ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశం పై జూలై 31న జస్టిస్ బీర్ గవాయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం .. తెలంగాణ శాసన సభ స్పీకర్ కు మూడు నెలల గడువు విధించారు. అక్టోబర్ 31తో ఆ గడువు ముగిసింది. దీనిపై స్పీకర్ ఎమ్మెల్యేల అనర్హత పై నిర్ణయం తీసుకోకపోవడంపై అసెంబ్లీ కార్యదర్శి ఇప్పటికే సుప్రీంలో లిస్ట్ చేశారు. సుప్రీంకోర్టు చెప్పినా.. తెలంగాణ స్పీకర్ ఎమ్మెల్యేల అనర్హత పై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వలన బీఆర్ఎస్.. కోర్టు ధిక్కరణ కేసు కింద పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోనందున కోర్టు స్వయంగా కల్పించుకొని పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వాళ్లే తుది నిర్ణయం తీసుకునే తీర్పు ఇవ్వాలని కేటీఆర్ మరో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. మొత్తంగా ఆయా పిటిషన్లను విచారించిన కోర్టు తెలంగాణ స్పీకర్ ను మందలిస్తూ.. పార్టీ మారిన ఎమ్మెల్యేల పై రాబోయే 28 రోజుల్లో ఏదో ఓ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
Also Read: ధర్మేంద్ర మొదటి భార్య ఎవరు..? విడాకులు ఇవ్వకుండానే ఎందుకు రెండో వివాహాం చేసుకున్నాడు..
Also Read: చిరంజీవికి అమ్మగా.. అక్కగా.. చెల్లిగా..భార్యగా యాక్ట్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.









