)
Supreme Court: తెలంగాణలో వైద్య విద్య చదవాలనుకుంటున్న విద్యార్థులకు 4ఏళ్ల స్థానికత తప్పనిసరి అని అత్యున్నత ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సుప్రీంకోర్టు సమర్థించింది. గతంలో తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి, డివిజన్ బెంజ్ ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెడుతూ సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేత్రుత్వంలోని సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు తెలంగాణలో చదవాల్సిందేనన్న నిబంధనను సుప్రీంకోర్టు సమర్థించింది. స్థానికతపై తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం 33 ప్రకారమే రిజర్వేషన్లు అమలు చేయాలంటూ సుప్రీంకోర్టు సూచించింది.
సుప్రీం కోర్టు వైద్య విద్యార్థుల స్థానికత నిబంధనపై కీలక తీర్పు వెలువరించింది. ఎంసీహెచ్, ఎంఎస్, ఎంబీబీఎస్, పీజీ కోర్సుల అడ్మిషన్లలో స్థానిక విద్యార్థులకే ప్రాధాన్యం ఇవ్వాలా? లేక దేశవ్యాప్తంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలా? అనే అంశంపై చాలా కాలంగా చర్చ నడుస్తోంది. తాజాగా ఈ వివాదానికి సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం, ప్రత్యేక రాష్ట్రాల్లో వైద్య విద్యలో రిజర్వేషన్ పొందాలంటే కనీసం నాలుగేళ్లు అక్కడ చదివి ఉండాలి. అంటే ఆ రాష్ట్రానికి చెందిన స్థానిక విద్యార్థులే అక్కడి మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందడంలో ప్రాధాన్యం పొందుతారు. ఇతర రాష్ట్రాల వారు ఆ కోటాలోకి రావడానికి అవకాశం ఉండదు.
తీర్పును వెలువరించిన న్యాయమూర్తులు .. వైద్య విద్య స్థానిక ప్రజల అవసరాలకు ముడిపడి ఉందని, ఒక రాష్ట్రంలో వైద్య సీట్లు ఉన్నప్పుడు ఆ రాష్ట్ర ప్రజలే ముందు లాభం పొందాలని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరతను దృష్టిలో ఉంచుకుని స్థానికత తప్పనిసరి చేయడం సముచితమని అభిప్రాయపడ్డారు. ఈ తీర్పుతో స్థానిక విద్యార్థులకు పెద్ద ఎత్తున లాభం కలుగనుంది. ఇప్పటివరకు దేశంలోని వివిధ రాష్ట్రాల విద్యార్థులు ఇతర రాష్ట్రాల కోటాలో కూడా సీట్లు పొందేవారు. దీంతో స్థానిక విద్యార్థులు వెనకబడి పోయే పరిస్థితులు ఏర్పడేవి. ఇకపై నాలుగేళ్లకు పైగా అక్కడ చదివిన వారికే స్థానికత అర్హత లభిస్తుందనగా, ఆ రాష్ట్ర విద్యార్థులకే ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. నీట్ ద్వారా జాతీయ స్థాయిలో జరిగే కౌన్సెలింగ్ కొనసాగుతుంది. అయితే స్టేట్ కోటా సీట్ల విషయంలో స్థానికత నిబంధన తప్పనిసరి అవుతుంది. అంటే 15శాతం ఆల్ ఇండియా కోటా యథాతథంగా కొనసాగుతుంది. కానీ మిగతా 85శాతం్ సీట్లు ఆయా రాష్ట్రాల విద్యార్థులకే కేటాయిస్తాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.