)
Purna Chandar Surrendered: ప్రముఖ టీవీ యాంకర్ స్వేచ్ఛ వొటార్కర్ ఆత్మహత్యలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె సన్నిహితుడైన పూర్ణచందర్ తన లాయర్ తో కలిసి హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులకు లొంగిపోయారు. ఈ నేపథ్యంలో ఆయనపై పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ఇటీవలే పూర్ణచందర్ తన కూతురు స్వేచ్ఛ ఆత్మహత్యకు కారణమని తండ్రి శంకర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా అతడు పెళ్లికి నిరాకరించడంతోనే స్వేచ్ఛ ఆత్మహత్యకు పాల్పడిందని ఆయన చెప్పారు. ఇంతలోనే పూర్ణచందర్ పోలీసులకు లొంగిపోయారు.
అంతకుముందు ఆయన ఐదు పేజీలకు సంబంధించిన లేఖను కూడా విడుదల చేశారు.స్వేచ్చ తనను భర్తగా ఊహించుకుందని.. ఆమెను తన కూతుర్ని బాగా చూసుకున్నాను అయిదు పేజీలో లేఖను విడుదల చేసిన సంగతి తెలిసింది. సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రధానంగా అయినా రాసిన లేఖలో అతని స్వేచ్ఛ తండ్రి చేసిన వ్యాఖ్యలకు ఆమె చాలా బాధపడిందని, ఆ తరువాతే సూసైడ్ చేసుకుంది అని కూడా చెప్పారు. ఇంతలోనే ఆయన పోలీసుల వద్దకు వచ్చి లొంగిపోయారు.
స్వేచ్ఛ తండ్రి చేసిన వ్యాఖ్యలు..
అయితే స్వేచ్ఛ తండ్రి మాత్రం తన కూతురు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం పూర్ణచందర్ అని ఆరోపించారు. మూడు సంవత్సరాల నుంచి పూర్ణచందర్‌తో తన కూతురు వెంటపడ్డాడు. ఆ తర్వాత వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నారు. అయితే ఈ మధ్య కాలంలో అతనితో ఉండాలని కూడా తేల్చి చెప్పిందని. 26వ తేదీ ఇద్దరి మధ్య గొడవ జరిగితే తనను ఇంటికి పిలిచింది అన్నాడు. ఇక పూర్ణచందర్ తో సంబంధంలో కొనసాగించలేనని చెప్పింది. ఆయన వేధింపుల వల్ల కూతురు తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుందని కన్నీరు పెట్టుకున్నారు శంకర్.
స్వేచ్ఛ టీవీ9 లో పనిచేశారు. 15 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన ఆమె ఇటీవల టీ న్యూస్ లో కూడా పనిచేసిన అనుభవం ఉంది. అయితే పూర్ణచందర్ ప్రకారం ఆమెకి ఇంతకుముందే రెండు పెళ్లిళ్లు అయి విడాకులు అయిపోయాయి. ఒక కూతురు కూడా ఉంది. కానీ పూర్ణచందర్ ఒక మృగంలాంటి వాడు అని స్వేచ్ఛ తండ్రి ఆరోపించాడు. అతనిని ఖచ్చితంగా శిక్షించాలని స్వేచ్ఛ తల్లిదండ్రులు డిమాండ్ కూడా చేశారు. 27వ తేదీ ఆత్మహత్య చేసుకుంది స్వేచ్ఛ. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. స్వేచ్ఛ ఆత్మహత్యపై కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు ఎంతో తెలివైన జర్నలిస్టులను తెలంగాణ కోల్పోయిందని ఆయన అన్నారు. .
అయితే గతంలోనే స్వేచ్ఛ తల్లిదండ్రులు భార్య పిల్లలు ఉన్నవాడితో వద్దు అని చెప్పినట్లు సమాచారం. అయినా ఆమె వినకుండా రిలేషన్షిప్ కొనసాగించింది. అయితే తన కూతురు చాలా ధైర్యవంతురాలు అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చేది. కానీ ఇలాంటి పని చేసిందని అనుకోలేదని వాళ్ళు బోరుమని ఏడ్చారు. వారి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగేవి. వాళ్ళ అమ్మానాన్నలతో మాట్లాడతామంటే కూడా తన కూతురు ఒప్పుకోలేదని స్వేచ్ఛ పేరెంట్స్ చెప్పుకొచ్చారు.
పూర్ణచందర్ పై పోక్సో కేసు నమోదు..
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో పూర్ణచందర్ పై కేసు నమోదు అయింది. 69బీఎంఎస్, 108 బీఎంఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు చిక్కడపల్లి పోలీసులు. అయితే స్వేచ్ఛ కూతురు స్టేట్మెంట్ ఆధారంగా పోక్సో కేసు కూడా నమోదు చేశారు. గతంలో తనతో కూడా పూర్ణచందర్ అసభ్యంగా ప్రవర్తించినట్లు స్టేట్మెంట్ ఇచ్చింది స్వేచ్ఛ కూతురు. ఈ నేపథ్యంలో పూర్ణచందర్ పై పోక్సో కేసు నమోదు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.