హైదరాబాద్ లో ఆ ఏరియాలో దారుణ పరిస్థితి.. మూడు నెలలుగా జల దిగ్భంధనంలో జనావాసాలు..

Tattiannaram: ఆ ఏరియా గ్రేటర్ హైదరాబాద్ కు దగ్గరలో ఉంది. గ్రేటర్ కు దగ్గరున్న ఆ ఏరియాలో నిత్యం సమస్యలే రాజ్యమేలుతున్నాయి. అక్కడున్న కాలనీలు గత మూడు నెలలుగా జల దిగ్భంధనంలో చిక్కుకున్న.. అక్కడున్న అధికారులకు నిమ్మకు నీరెత్తినెత్తినట్టు ప్రవర్తిస్తున్నారు. ఇంతకీ  ఆ ఏరియా విషయానికొస్తే..

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 13, 2025, 03:53 PM IST
హైదరాబాద్ లో ఆ ఏరియాలో దారుణ పరిస్థితి.. మూడు నెలలుగా జల దిగ్భంధనంలో జనావాసాలు..

Tattiannaram:  పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని తట్టి అన్నారం మారుతి నగర్ లో గత మూడు నెలలుగా జనావాసాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో ప్రజలు ఇళ్లలోకి వెళ్లాలన్నా.. ఇంటి నుంచి బయటకు రావాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్ కు చేరువలో ఉన్న అక్కడ నిత్యం సమస్యలు వెంటాడుతున్నాయి. అక్కడ ప్రజలు ఈ విషయమై ఎన్ని సార్లు విన్నవించినా.. అధికారులు,  ప్రజా ప్రతినిధులు సరైన రీతిలో స్పందించడం లేదనే విషయం స్పష్టమవుతుంది. 

Add Zee News as a Preferred Source

తట్టి అన్నారం ఎగువనున్న చెరువు నీరు లీక్ అవుతూ మురుగునీరుతో కలిసి కాలనీలోకి చేరడంతో రోడ్లన్నీ పూర్తిగా దుర్వాసనతో నిండిపోయాయి. రోడ్డు పాకురుతో నిండిపోవడంతో చాలామంది వాహనాలపై నుంచి కిందపడి గాయాల పాలయ్యావుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వచ్చి వెళ్ళిపోతున్నారు తప్ప సమస్యకు పరిష్కారం చూపట్లేదు అంటూ కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. 

మున్సిపల్ కమిషనర్‌కు పలుమార్లు విన్నవించుకున్నా... హైడ్రా, ఇరిగేషన్ అధికారులకు చెప్పుకున్నా.. తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు రేవంత్ సర్కారు ఈ విషయమై చీమ కుట్టినట్టు కూడా లేదంటున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. తాము ఇక్కడ ఇల్లు అమ్ముకొని వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడిందనీ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ప్రతిరోజు పిల్లల్ని స్కూలుకు పంపాలంటే భయం భయంగా ఉందంటూ సాయంత్రం అయితే దోమలు దుర్వాసన, పాములతో భయం భయంగా బతుకుతున్నామని కాలనీవాసులు తెలిపారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే  స్పందించి అక్కడ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.  

Read more: రెబల్ స్టార్ ప్రభాస్ ఇంటిని చూశారా.. ఏకంగా మాహిష్మతిని తలదన్నేలా ఉన్న రాజా సాబ్ భవనం..!

Read more: ప్రభాస్ ఆస్తుల విలువ ఎన్ని వేల కోట్లో తెలుసా..! అస్సెట్స్ విషయంలో నిజంగానే బాహుబలి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News