
She Is My Girl: నిండా 20 ఏళ్లు కూడా నిండలేదు. నునుగు మీసాలు కూడా రాలేదు అప్పుడే మగాళ్లమైపోయామని రెచ్చిపోతున్నారు. ప్రేమనా? వ్యామోహమా? అని తెలియని పరిస్థితుల్లో దాడులు చేసుకుంటున్న పరిస్థితి. ప్రేమకు అర్థం తెలియని టీనేజర్లు పరస్పరం దాడులు చేసుకుంటూ ప్రాణాలు తీసుకుంటున్నారు. భవిష్యత్ మీద ఫోకస్ పెట్టకుండా అమ్మాయిల కోసం టీనేజర్లు కొట్టుకుంటున్నారు. వారి భాషలో 'నిబ్బాగాళ్లు' అని చెప్పవచ్చు. అటువంటి వారి దాడిలో ఓ టీనేజర్ ప్రాణం పోయింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
'నా లవర్‌కు ఎందుకు కాల్ చేస్తున్నావు.. అది నా పిల్ల?' అంటూ యువతి మాజీ ప్రియుడు వేరే యువకుడికి ఫోన్ చేసి దుర్భాషలాడాడు. కలిసి మాట్లాడదాం రా అని ఒకచోటకు పిలిచి తన గ్యాంగ్‌తో దాడికి పాల్పడ్డాడు. వారి దాడిలో గాయపడిన 16 ఏళ్ల పోరడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
జవహర్ నగర్ పీఎస్ పరిధిలోని ప్రగతి నగర్ సమీపంలో 16 ఏళ్ల అయాన్ తన తల్లిదండ్రులతో నివసించేవాడు. ఓ యువకుడు అయాన్‌కి గురువారం సాయంత్రం ఫోన్ కాల్ చేసి 'నా ప్రియురాలితో ఎందుకు మాట్లాడుతున్నావు' అని ఫోన్లో తీవ్రస్థాయిలో దుర్భాషలాడాడు. 'రాధికా థియేటర్ వద్దకు రా.. అక్కడ మాట్లాడుకుందాం' అని యువతి మాజీ ప్రియుడు పిలిచాడు. అక్కడికి చేరుకున్న అయాన్‌కు అప్పటికే అక్కడ ఉన్న మాజీ ప్రియుడు, అతడి తొట్టి గ్యాంగ్‌తో కలిసి దాడికి పాల్పడ్డారు.
యువకులు అయాన్‌పై విచక్షణా రహితంగా దాడికి పాల్పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న అయాన్‌ను గమనించిన స్థానికులు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. అక్కడికి చేసుకున్న అంబులెన్స్ కాప్రాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతుండగానే అయాన్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తలరించారు. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు సీసీ కెమెరాతోపాటు అయాన్ ఫోన్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook