Teenmar Mallanna: పులి బోన్ లో నుంచి బైటికొచ్చింది.. మీకు చుక్కలే.!.. సస్పెన్షన్ పై తీన్మార్ మల్లన్న టీమ్ రియాక్షన్ ఇదే.. వీడియో..

Teenmar mallanna controversy: తీన్మార్ మల్లన్నను టీపీసీసీ సస్పెండ్ చేస్తు ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో దీనిపై తీన్మార్ మల్లన్న టీమ్  ఒక వీడియోను రిలీజ్ చేసిన దానికి పులి బోన్ నుంచి బైటకొచ్చిందని క్యాప్షన్ ను జత చేశారు.

Written by - Inamdar Paresh | Last Updated : Mar 1, 2025, 07:30 PM IST
  • టీపీసీసీపై స్పందించిన మల్లన్న టీమ్..
  • దబిడి దబిడే అంటూ వ్యాఖ్యలు..
Teenmar Mallanna: పులి బోన్ లో నుంచి బైటికొచ్చింది.. మీకు చుక్కలే.!.. సస్పెన్షన్ పై తీన్మార్ మల్లన్న టీమ్ రియాక్షన్ ఇదే..  వీడియో..

Teenmar mallanna team reacts on tpcc suspension: టీపీసీసీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు బిగ్ షాక్ ఇచ్చింది. ఆయన గతంలో రేవంత్ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన గణనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా.. బీసీల గురించి జనాభా లెక్కలు సరిగ్గా చేయలేదని కామెంట్స్ చేశారు. అనేక చోట్ల రెడ్డీల గురించి వివాదాస్పదంగా మాట్లాడారు. బీసీ గణనన పత్రాలను కూడా కాల్చేశారు. దీనిపై టీపీసీసీ సీరియస్ అయ్యింది. వెంటనే దీనిపై వివరణ ఇవ్వాలని కూడా గతంలో షోకాజ్ నోటీసుల్ని జారీ చేసింది. దీనికి ఫిబ్రవరి 12ను డెడ్ లైన్ గా కూడా పెట్టింది.

Add Zee News as a Preferred Source

 

అయితే.. తీన్మార్ మల్లన్న మాత్రం కాంగ్రెస్ నోటీసులకు రెస్పాండ్ కాలేదు. ఈ క్రమంలో తాజాగా.. ఢిల్లీ నుంచి తెలంగాణ ఇన్ చార్జీగా మీనాక్షి  నటరాజన్ నిన్న (శుక్రవారం) బాధ్యతలు తీసుకున్నారు. ఆమె సాదాసీదాగా ట్రైన్ లో వచ్చారు. ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా..తన బ్యాగ్ ను తనే మోసుకుంటూ వచ్చారు. గాంధీ భవన్ లో నేతలతో సమావేశం అయ్యారు. ఈ క్రమంలో నేతలకు దిశానిర్దేషం చేశారు. అయితే.. మీనాక్షి  నటరాజన్ బాధ్యతలు తీసుకున్న 24 గంటలు గడవక ముందే టీపీసీసీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకొవడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

దీనిపై తీన్మార్ మల్లన్న టీమ్ ఒక వీడియోను ట్యాగ్ చేస్తు  ఇన్ డైరెక్ట్ గా కాంగ్రెస్ పై తమ పంథాను బైటపెట్టారు. గతంలో తీన్మార్ మల్లన తన ఛానెల్ డిబెట్ లో మాట్లాడుతూ.. ప్రివిలెజ్ కమిటీ.. గతంలో జానా రెడ్డి కళ్లలో ఆనందం కోసం తనకు నోటీసులు జారీ చేశారని.. దీనిపై తాను స్పందించేది లేదన్నారు. తాను.. తల వంచితే.. బీసీల ముందు తలవంచుతాకానీ.. రెడ్ల ముందు మాత్రం తలవంచేదిలేదని స్పష్టం చేశారు.

Read more: Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నపై సస్పెన్షన్ వేటు.. సంచలన వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్...

ఏం చేసుకొంటారో చేసుకొండని.. గతంలోనే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ కు సవాల్ విసిరారు.  దీనిపై ప్రస్తుతం తీన్మార్ మల్లన్న టీమ్.. పులి బోనులో నుంచి బైటకు వచ్చిందని.. ఇక వేటా ఎలా ఉంటుందో మీరే చూసుకొండని కూడా క్యాప్షన్ జతచేశారు. ప్రస్తుతం తీన్మార్ మల్లన్న భవిష్యత్ లో ఏవిధంగా ముందుకు వెళ్తారో అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News