Telangana Formation Day: దేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. తెలంగాణ ప్రాంత వాసులకు స్వాతంత్య్రం సిద్ధించలేదు. బ్రిటిష్ వారు భారత దేశానికి స్వాతంత్య్రం ఇస్తూ ఇక్కడున్న స్వదేశీ సంస్థానాధీశులు వారు ఇష్ట ప్రకారం భారత దేశంతో కలిసి ఉండటమా.. లేకపోతే పాకిస్థాన్ లో కలవాలనేది వారి ఇష్ట ప్రకారానికే ఒదిలేసారు. ఇక అప్పటి ఉప ప్రధాని హోం మంత్రి సర్ధార్ వల్లభభాయ్ పటేల్ చొరవతో దేశంలోని అన్ని సంస్థానాలు మన దేశంలో విలీనమయ్యాయి. కానీ జమ్మూ కాశ్మీర్, జునాఘడ్, హైదరాబాద్ సంస్థనాలు మాత్రం మన దేశంలో విలీనం కాలేదు. హైదరాబాద్ ను అపుడు పరిపాలిస్తున్న 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్.. హైదరాబాద్ సంస్థానాన్న పాకిస్థాన్ లో కలపాలనే కుట్రకు తెర తీసారు. అప్పటి హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలో పలు జిల్లాలండేవి. అప్పట్లో ఇక్కడ మెజారిటీ ప్రజలైన హిందువులైన ఖాసీం రజ్వీ నేతృత్వంలోని రజాకార్ అనే ప్రైవేట్ సైన్యం అనేక దారుణ మారణ కాండాలు నిర్వహించింది.
ఆ తర్వాత సర్ధార్ పటేల్.. అప్పటి మిలటరీ అధికారి జెఎన్ చౌదరి ఆధ్వర్యంలో ఆపరేషన్ పోలో తో హైదరాబాద్ నిజాం.. భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత 1948 సెప్టెంబర్ 17న ఇక్కడ ప్రజలకు స్వాతంత్య్రం సిద్ధించింది. ఆ తర్వాత భాష ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదిక 1956లో అప్పటి హైదరాబాద్ స్టేట్ లో తెలుగు మాట్లాడే ప్రజలతో పాటు ఆంధ్ర రాష్ట్రాన్ని ను కలిపి 1956 నవంబర్ 1 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసారు. అప్పటి నుంచి ఆంధ్రా పాలకుల పెత్తనమే కొనసాగింది. మధ్యలో తెలంగాణ వాళ్లైన జలగం వెంగళరావు, పీవీ నరసింహారావు, చెన్నారెడ్డి వంటి వాళ్లు ముఖ్యమంత్రు అయినా.. వాళ్లను ఎక్కువ కాలం ఆంధ్రా పాలకులు కొనసాగనివ్వలేదు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 1952 నుంచి 1969 వరకు ఉద్యమం సాగింది. ఆ తర్వాత 2001 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రజలు దశలవారీగా ఉద్యమాలు చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసుకున్నారు. ఇందులో టీఆర్ఎస్ ఛీఫ్ కేసీఆర్ పాత్ర మరవలేనిది. ముఖ్యంగా అప్పట్లో యూపీఏ ప్రభుత్వం ప్రణబ్ ముఖర్జీ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆయన దేశంలోని వివిధ పార్టీలతో సంప్రదింపులు జరిపారు. 2019 హైదరాబాద్ ఫ్రీ జోన్ అంశంతో కేసీఆర్ ఉద్యమానికి దిగడం.. ఆయన్ని అరెస్ట్ చేయడం.. ఆపై ఆయన ఆరోగ్యం క్షీణించడంతో డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటుకు అప్పటి యూపీఏ ప్రభుత్వం తరుపున అప్పటి హోం మినిష్టర్ చిదంబరం అనౌన్స్ చేశారు. ఆ తర్వాత డిసెంబర్ 23న మళ్లీ వేరే ప్రకటన.. ఇలా తెలంగాణ ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకొని ఉద్యమం పతాక స్థాయికి చేరుకుంది. దీంతో ప్రభుత్వం చేసేది ఏమి లేక..ప్రత్యేక రాష్ట్రాం ఇవ్వాల్సిన పరిస్థితులు ఇక్కడ ప్రజలు కల్పించారు. ఇక ఎన్నో సంప్రదింపుల తర్వాత అప్పటి యూపీఏ ప్రభుత్వం 2014 ఫిబ్రవరి 18న లోక్ సభలో తెలంగాణ రాష్ట్ర బిల్లును అప్పటి హెం మినిష్టర్ సుశీల్ కుమార్ షిండే ప్రవేశ పెట్టారు. ఆ తర్వాత ఫిబ్రవరి 20న రాజ్యసభలో ప్రత్యేక రాష్ట్రానికి ఆమోద ముద్ర పడింది. 2014 మార్చి 1 రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఆ తర్వాత జూన్ 2న తెలంగాణ అపాయింటెడ్ డేగా గెజిట్ నోటిఫికేషన్ వెలుబడింది. 2014 జూన్ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కల సాకారమైంది.
Also Read: NTR Sensational Record: తెలుగులో మరే ఇతర హీరోలు బ్రేక్ చేయని రికార్డు సాధించిన అన్న ఎన్టీఆర్..
Also Read: Nandamuri Heroes: నందమూరి మూడు తరాల హీరోలు కలిసి నటించిన ఈ సినిమా తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









