Telangana Formation Day Celebrations: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కల సాకారమై నేటితో 11 యేళ్లు పూర్తయింది. ఘనంగా 12వ యేట అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని తెలంగాణ అమర వీరులకు నివాళులు అర్పించారు. అటు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఓపెన్ టాప్ జీపు్ లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలకు ఛీప్ గెస్ట్ గా జపాన్ లోని కితక్యూషు సిటీ మేయర్ గా కజహిసా టకేచి అటెండ్ అయ్యారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించారు. ఈ సందర్బంగా పలువురు పోలీసుకు సేవా పతకాలను అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర కల సాకారం చేసిన ఘనత సోనియా గాంధీకే దక్కుతుందన్నారు. అంతేకాదు తెలంగాణ ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
ఉద్యోగ నియామాల్లో దేశంలో నెంబర్ ప్లేస్ లుంది. నిరోద్యోగుల ఆశలను నెరవేర్చాము. సివిల్స్ కు ఎంపికైన వారికి రూ. లక్ష ప్రోత్సాహకం అందించాము. అంతేకాదు విద్యా, వైద్య రంగాలను ప్రక్షాళన చేశాము. ప్రభుత్వ వసతి గృహాల్లో అన్ని రకాల మెస్ ఛార్జీలను పెంచాము. ఉస్మానియా ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకొస్తాము. వందేళ్లలో ఎన్నడూ లేనట్టుగా కుల గణన చేసి చూపించాము. మా నిర్ణయంతో కేంద్ర దిగొచ్చు దేశ వ్యాప్తంగా కులగణన చేయడానికి ముందుకు వచ్చిందన్నారు.
అంతేకాదు రైతు సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతుల భూముల పరిష్కారం కోసమే భూ భారతి చట్టం తీసుకొచ్చిన వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. వాళ్లకు రుణ మాఫీ చేసిన ఘనత తమ కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. అంతేకాదు మహిళలను కోటీశ్వరులుగా మార్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మహిళా సంఘాలకు ఉచితంగా బస్సులను ఆర్టీసీకి అద్దెకు తీసుకొని వాళ్లకు ఇంకమ్ జనరేట్ చేయిస్తామన్నారు.క్యూర్ కోడ్ తో మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలకు చేయించే పథకాన్ని తీసుకురాబోతున్నట్టు చెప్పారు.
Also Read: NTR Sensational Record: తెలుగులో మరే ఇతర హీరోలు బ్రేక్ చేయని రికార్డు సాధించిన అన్న ఎన్టీఆర్..
Also Read: Nandamuri Heroes: నందమూరి మూడు తరాల హీరోలు కలిసి నటించిన ఈ సినిమా తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









