Telangana MLC Counting: రసవత్తరంగా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్..

Telangana MLC Counting: తెలంగాణలో గత నెల 27వ తేదిన జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కౌంటింగ్ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ఒక పట్టభద్రుల నియోజకవర్గం.. రెండు టీచర్ ఎమ్మెల్సీకి జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 3, 2025, 08:11 AM IST
Telangana MLC Counting: రసవత్తరంగా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్..

Telangana MLC Counting: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక చోట మాత్రమే పోటీ చేసింది. అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం కాడి ఒదిలేసింది. ఓవరాల్ గా చూసుకుంటే అస్త్ర సన్యాసం చేసింది. ప్రభుత్వ వ్యతిరేకతకు అద్దం పట్టే ఎలక్షన్స్ లో పోటీ చేయపోవడంపై బీఆర్ఎస్ క్యాడర్ లో ఒకింత నిరుత్సాహాం నెలకొంది. అయితే.. ఇది కేవలం టీచర్స్, కొంతమంది గ్రాడ్యుయేట్స్ వేసే ఓట్లు కాబట్టి పెద్దగా ప్రభావం ఉండదనే ఉద్దేశ్యంతో పోటీకి దూరంగా ఉన్నారు.

Add Zee News as a Preferred Source

అటు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మాత్రం మూడు స్థానాల్లో తన అభ్యర్ధులను నిలబెట్టింది. అంతేకాదు ఆయా స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చింది. ఇందులో ఒకటి రెండు స్థానాల్లో గెలిచినా ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి లేకపోయినా.. కేంద్రంలో అధికారంలో ఉండటం.. సంస్థాగతంగా ఆ పార్టీకి కార్యకర్తల అండనే ఆ పార్టీకి ప్రధాన బలం.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.

ఇక మూడు ఎమ్మెల్సీ స్థానాలకు  జరిగిన ఎన్నికలకు గాను  కౌంటింగ్‌ జరుగనుంది. గత నెల 27న ఎన్నికలు జరగగా నేటి కౌంటింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. కరీంనగర్‌-మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు ఉపాధ్యాయ నియోజకవర్గానికి కరీంనగర్‌లోని అంబేడ్కర్‌ ఇండోర్‌ స్టేడియంలో కౌంటింగ్‌ జరుగనుంది.  వరంగల్‌-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి నల్గొండలోని వేర్‌హౌసింగ్‌ గోదాములో కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. తుది ఫలితం రావడానికి రెండు రోజుల సమయం వట్టే అవకాశం వుంది.

ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..

ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News