Acb rainds on aee Nikesh kumar: తెలంగాణలో ప్రస్తుతం ఇరిగేషన్ శాఖకు చెందిన.. అవినీతి అధికారి ఏఈఈ వ్యవహారం తీవ్ర దుమారంగా మారిందని చెప్పుకొవచ్చు. సదరు అవినీతిఅధికారి.. గండిపేట మండలం పీరం చెరువు పెబెల్ సిటీ గేటెట్ కమ్యూనిటీలోని నీటి పారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ప పనిచేస్తున్నట్లు తెలుస్తొంది. అయితే.. ఏసీబీ చరిత్రలోనే ఇది రెండో అతిపెద్ద అవినీతి కేసుగా చెప్తున్నారు.
అయితే.. ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు.. నికేష్ నివాసంతో పాటు.. ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఏకకాంలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో భారీగా నగదు, బంగారం, ఇళ్ల స్థలాలు, పోలాలకు చెందిన డాక్యుమెంట్ లు లభించినట్లు తెలుస్తొంది. తొలుత ఏసీబీ అధికారులు మాత్రం..200 కోట్ల వరకు అక్రమార్జన జరిగిందని అంచనా వేశారు.
కానీ .. దొరుకుతున్న వాటిని చూస్తుంటే.. దాదాపు.. 600 కోట్ల వరకు కూడా వెళ్లే చాన్స్ లేకపోలేదని అధికారులు అనుకుంటున్నాంట. ముఖ్యంగా నికేష్ కుమార్ బఫర్ జోన్ లలో నిర్మాణ పనులకు అనుమతులు ఇవ్వడంలో సిద్దహస్తుడని చెప్తున్నారు. ఎక్కడైన ఏదైన..ల్యాండ్, చెరువు, మొదలైన ప్రదేశాలలో వివాదాం ఉంటే.. అందులో కల్గజేసుకుని .. అనుమతులు ఇప్పించి.. భారీగా ముడుపులు తీసుకునే వారని కూడా ప్రచారం జరుగుతుంది.
ప్రస్తుతం నికేష్ కుమార్ ఆస్తులు చిట్టా చూస్తుంటే.. అధికారుల కళ్లు బైర్లు కమ్ముతున్నాయంట. నానాక్ రామ్ గూడ, శంషాబాద్, గచ్ఛిబౌలీలోని విల్లాలు, నార్సింగీలో కాస్లీ విల్లాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అదే విధంగా.. వాసవి అట్లాంటిస్ నానక్ రామ్ గూడ, మైరాన్ విల్లా, బ్లిస్ శంషాబాద్, కపిల్ ఇన్ఫ్రా, సాస్ గచ్చిబౌలి, రాయిచాందినీ లో ఖరీదైన విల్లా లు ఉన్నట్లు తెలుస్తొంది.
నార్సింగి లో నాలుగు అంతస్తుల హాస్టల్ భవనం, మొయినాబాద్ లో ఆరు ఎకరాల్లో మూడు ఫామ్ హౌస్ లు, తాండూరులో మూడెకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.ప్రస్తుతం అధికారులు.. నికేష్ కుమార్ బంధువులు బినామీలకు చెందిన ఏడు లాకర్లను గుర్తించినట్లు తెలుస్తొంది. వీటిని రేపు తెరవనున్నట్లు సమాచారం. నికేష్ కుమార్ తో పాటు బంధువుల నివాసంలో కిలో పైగా బంగారాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తొంది.
గతంలో ఏసీబీ అధికారులకు ట్రాప్ అయిన సీసీఎస్ మాజీ ఏసిపి ఉమా మహేశ్వర రావు తో కలిపి నికేష్ కుమార్ పలు సెటిల్మెంట్ లు చేసినట్లు తెలుస్తొంది. ఇది.. ఏసీబీ చరిత్రలోనే రెండో అతిపెద్ద ఆదాయానికి మించిన ఆస్తుల కేసుగా తెలుస్తొంది.
Read more: Tiger Attack: బెంబేలెత్తిస్తున్న పెద్దపులి.. ఈసారి రైతుపై దాడి.. భయంతో వణికిపోతున్న ప్రజలు..
ఏసీబీ చరిత్రలో ఇప్పటి వరకు.. దేవికరాణీ, నికేష్ కుమార్, బాలకృష్ణ టాప్ 3 కేసులుగా ఉన్నాయంట. ప్రస్తుతం ఏసీబీ అధికారులు నికేష్ కుమార్ ను కోర్టులో హజరు పర్చినట్లు తెలుస్తొంది. ఆయనకు కోర్టు.. 14రోజుల పాటు రిమాండ్ విధించినట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









