Telangana Assembly budget Session 2025: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పైగా చాలా రోజుల తర్వాత ప్రతిపక్ష నేత కేసీఆర్ (కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు) అసెంబ్లీకి హాజరు కావడంతో ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ అయిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కేసీఆర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.
అయితే అసెంబ్లీ సమావేశాలకు గంట ముందే వచ్చారు కేసీఆర్. తన ఛాంబర్ లో కూర్చున్నారు. ఆ సమయంలోనే కేసీఆర్ దగ్గరికి వచ్చి కలిశారు గూడెం మహిపాల్ రెడ్డి. కొంత కాలంగా గూడెం మహిపాల్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ లోకి వస్తారనే ప్రచారం సాగుతోంది.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
కాట శ్రీనివాస్ వర్గీయులు ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తన కార్యాలయంలో కేసీఆర్ ఫోటో బరాబర్ పెట్టుకుంటానని గూడెం స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే అసెంబ్లీలో కేసీఆర్ ను కలవడంతో గూడెం ఏం చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు కాంగ్రెస్ వైపు వెళ్లిన కొంత మంది ఎమ్మెల్యేలు అనర్హత వేటు పడుతుందనే భయంతో తిరిగి సొంత గూటికి చేరుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









