Telangana Assembly Budget Session: తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో పలు కీలక ప్రవేశ పెట్టడానికి రంగం సిద్ధం అయింది. బీసీలకు చట్టసభల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించిన అనంతరం..దేశ వ్యాప్తంగా బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దేవాదాయ మంత్రి కొండా సురేఖ మరో బిల్లును ప్రవేశపెడతారు. తెలంగాణ ధార్మిక, హిందూ మత సంస్థల బిల్లుకు ఆమె సవరణలు ప్రతిపాదించనున్నారు.
సోమవారం శాసనసభ, శాసనమండలి ప్రశ్నోత్తరాలను చేపట్టనున్నాయి. విదేశీ విద్యానిధి పథకంతో పాటు ప్రభుత్వ జీవోలను అందుబాటులో ఉంచడం, సంక్షేమ హాస్టళ్లలో డైట్ చార్జీల పెంపు, హెచ్‌ఎండీఏ భూముల తాకట్టు తదితర అంశాలపై సభ్యులు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది. ఇక మండలిలో కూడా కీలక ప్రశ్నలు రానున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, కల్యాణమస్తు, ఇందిరమ్మ ఇళ్లు, సీతారామ ప్రాజెక్టు, ఫార్మాసిటీ తదితర అంశాలపై ప్రశ్నలకు ప్రభుత్వం జవాబివ్వనుంది.
చరిత్రాత్మకమైన బీసీ రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ కానున్నారు. మంత్రి చాంబర్‌లో వారి కోసం బ్రేక్‌ఫాస్ట్ ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.