)
Telangana Assembly Mansoon Session 2025 Live: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ముందుగా మృతి చెందిన ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సభ నివాళులు అర్పించనుంది. రీసెంట్ గా కన్నుమూసిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు శాసన సభ నివాళులు అర్పించనుంది. దీనికి పార్టీలకు అతీతంగా అందరు హాజరై ఆయన మృతికి సంతాప సూచకంగా మొదటి రోజు సంతాప తీర్మాణం చేయనుంది. మరోవైపు సభ ఎన్ని రోజులు నిర్వహించాలనేది బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. శాసన సభ సమావేశాల నేపథ్యంలో సభ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై ఇప్పటికే స్పీకర్ ప్రసాద్ కుమార్ పోలీసు, ఇంటెలిజెన్స్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శాసన సభ, శాసన మండలి సజావుగా జరిగేలా పోలీసు డిపార్ట్ మెంట్ చర్యలు తీసుకోవాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పోలీసులకు తగిన సూచనలు చేశారు. సభలు జరుగుతున్న సమయంలో ధర్నాలు, ఆందోళనలు జరగకుండా ముందస్తుగానే సమాచారం అందుకుని అడ్డుకోవాలని సూచించారు. తద్వారా సమావేశాలు సజావుగా జరిగే చూడాలని కోరారు. ఈ మీటింగ్ లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, పోలీసు, ఇంటెలిజెన్స్ అధికారులు హాజరయ్యారు.
వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జనం జరుగుతున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు భారీ వర్షాల వల్ల రోడ్లు దెబ్బ తిన్న మార్గాల్లో ట్రాఫిక్ అధికారులు సమన్వయం చేసుకుని సభ్యులు సరైన సమయానికి సభకు చేరుకునే విధంగా సహకరించాలన్నారు. ఈ సందర్భంగా సభ సజావుగా జరగడానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని సీఎస్ కే. రామకృష్ణారావు చెప్పారు. ఈ శాసనసభ సమావేశాల్లోనే డిప్యూటీ స్పీకర్ ను ఎంపిక చేయనున్నారు. మరోవైపు కీలకమైన కాళేశ్వరం నివేదికను ప్రభుత్వం శాసన సభలో ప్రవేశ పెట్టనుంది.
ఈ అసెంబ్లీ సెషన్ లోనే సమావేశంలో కాళేశ్వరం రిపోర్ట్ ప్రవేశపెట్టి బీఆర్ఎస్ ను రాజకీయంగా దెబ్బకొట్టేందుకు వ్యూహం రచించనట్టు తెలుస్తోంది. అంతేకాదు కాళేశ్వరం రిపోర్ట్ తో బీఆర్ఎస్ ఛీఫ్ ను కార్నర్ చేయాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. కమిషన్ పై సభలో కాంగ్రెస్ ఏం తీర్మానించబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రత్యేక దర్యాప్తు సంస్థ ద్వారా కేసీఆర్ , హరీష్ ను రేవంత్ టార్గెట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. విచారణ పేరుతో ఫాం హౌజ్ తో పాటు పలు చోట్లు సోదాలు జరిపే యోచనలో ఉన్నట్టు ప్రభుత్వ వర్గలు చెబుతున్న మాట.
సోదాల్లో ఏమైనా డబ్బు లభిస్తే కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ కూడా కాళేశ్వరం రిపోర్ట్ పై బీఆర్ఎస్ ను దెబ్బతీయాలనుకుంటున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాళేశ్వరం కమిషన్ పై అసెంబ్లీలో చర్చ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు జరగనున్నాయి. ఒకవేళ కాళేశ్వరం రిపోర్ట్ ఆధారంగా కేసీఆర్,హరీష్ రావులను ను అరెస్ట్ చేసేంత ధైర్యం రేవంత్ రెడ్డి చేస్తాడా అనేది చూడాలి. అరెస్ట్ కాకుండా ప్రత్యామ్నాయ ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారా అనేది చూడాలి. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుపెట్టుకొని కూడబెట్టిన కేసీఆర్ ఆస్తులను జప్తు చేయాలని సీఎం రేవంత్ ఆలోచిస్తున్నారా అనే విషయం పై చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఇటు రాజకీయంగా బీఆర్ఎస్ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తూనే ఆర్థికంగా దెబ్బతీయాలన్నదే రేవంత్ ప్లాన్ గా కనిపిస్తోంది.
మరి రేవంత్ వ్యూహానికి బీఆర్ఎస్ ఎలాంటి ప్రతివ్యూహంతో తిప్పికోట్టబోతోందనేది చూడాలి. ఒక వైపు మాటల మరాఠీలైన హరీష్ రావు, కేటీఆర్ ల వాగ్ధాటికి రేవంత్ టీం ఎంత వరకు అసెంబ్లీలో నిలబడుతుందనేది చూడాలి. కాళేశ్వరం పై సభలో ఎవరి వాదనలు ప్రజలు ఆమోదిస్తారనేది అంశం రాబోయే మున్సిపల్, ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుస్తుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ల యుధ్ధంలో బీజేపీ ఏం చేయాలనుకుంటుందనేది కూడా ఆసక్తికరమైన అంశం అనే చెప్పాలి. అసలు కాళేశ్వరం విషయంలో కాషాయ పార్టీ ప్లాన్ ఏంటి.. ? కాళేశ్వరం పై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తోన్న బీజేపీ కోరికను కాంగ్రెస్ ఒప్పుకుంటుందా అనేది చూడాలి. మొత్తంగా ఈ సారి అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా రంజుగా సాగనున్నట్టు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.