Telangana Assembly: రోజా రొయ్యల పులుసు తినలేదా కేసీఆర్.. అసెంబ్లీలో రేవంత్ సూటి ప్రశ్న..

Telangana Assembly: కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసింది కెసిఆర్ కాదా.. దీనిపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం. కేసీఆర్ చర్చలో పాల్గొనాలి. అంతేకాదు అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ ను గుండు సున్నా చేస్తాం అని కేసీఆర్ కు రేవంత్ సవాల్ విసిరారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 15, 2025, 02:30 PM IST
Telangana Assembly: రోజా రొయ్యల పులుసు తినలేదా కేసీఆర్.. అసెంబ్లీలో రేవంత్ సూటి ప్రశ్న..

Telangana Assembly: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాజీ సీఎంపై రెచ్చిపోయారు. అంతేకాదు అసెంబ్లీకి రానీ కేసీఆర్ తో మీరు మాట్లాడి సభకు వచ్చేలా చూడండి అంటూ స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. నేను ఏదైనా తప్పు చేస్తే .. కేసీఆర్, బీఆర్ఎస్ క్షమాపణ చెప్పేందుకు నేను రెడీ అన్నారు. మీరు స్ట్రెచర్ గురించి మాట్లాడుతున్నారు.. మీకు స్టేట్ ఫ్యూచర్ అవసరం లేదున్నట్టు ప్రవర్తిస్తున్నారు. మార్చురీ అనే పదం BRS పార్టీని అన్నాను...కెసిఆర్ ను కాదు అని స్పష్టం చేశారు. కెసిఆర్ కుర్చీని నాలుగుకోట్ల మంది గుంజుకుని నాకు ఇచ్చారు.. ఇప్పుడు కెసిఆర్ తో ఉందేమిటి?

కెసిఆర్ ఎల్లప్పుడు ఆయుర్ అనారోగ్యాలతో ఉండాలని రేవంత్ ఆకాక్షించారు.  నిండు నూరేళ్లు కెసిఆర్ ప్రతిపక్షంలో ఉండాలి. నేను ఇక్కడే ఉండాలి. అప్పట్లో  ఏపీ మినిస్టర్ రోజా చేసిన రొయ్యల పులుసు తిన్నది కెసిఆర్ కాదా? రాయలసీమ లను రత్నాల సీమ చేసింది కెసిఆర్ కాదా ? రొయ్యల పులుసు తిని.. పాలమూరు ఎంపీగా చేసిన మాకు ఎండబెడతావా? ఇదా మీ.. నీతి జాతి.?

కమిషన్ లకు అమ్ముడుపోకుండా జూరాల నుండి కృష్ణా నీళ్లు తీసుకుంటే… ఇప్పుడు ఏపీ మన ముందు మోకరిల్లేదన్నారు.
మొత్తంగా తెలంగాణను అందినకాడికి దోచుకొన్న తండ్రి, కొడుకు,అల్లుడు లు పైశాచికానందం పడుతున్నారు.  రాష్ట్రంలో విషాదం అయ్యితే చాలు వారు అంతులేని ఆనంద పడుతున్నారు.

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News