Global Summit: ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ కనీవినీ ఎరుగని రీతిలో పెట్టుబడులను ఆకర్షించింది. గతంలో దావోస్ పెట్టుబడులు లక్షల కోట్లు ఆకర్షించగా.. ఈ సదస్సుతో మరిన్ని పెట్టుబడులను పొందింది. ప్రఖ్యాత కంపెనీలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువచ్చారు. ఐటీ, విద్యుత్, డేటా సెంటర్లు, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టారు. ఆ పెట్టుబడుల విలువ రూ.5 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి.
Also Read: Railway Good News: భక్తులకు రైల్వే గుడ్‌న్యూస్.. తిరుపతి - షిర్డీ మధ్య కొత్త రైలు ప్రారంభం
రెండో రోజు వివిధ కంపెనీల ప్రతినిధులు తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. వారితో సమావేశమైన ముఖ్యమంత్రి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాలు పెంపునకు వచ్చిన భారీ ప్రాజెక్టులు ఎంతో ఉపయోగపడనున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్, డేటా సెంటర్లు, ఔషధ రంగం, క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ వంటి విభాగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు రానున్నాయి.
==> ఇన్‌ఫ్రాకీ డీసీ పార్క్స్ 150 ఎకరాల్లో 1 గిగావాట్ సామర్థ్యం ఉన్న భారీ డేటా పార్క్ అభివృద్ధి చేపట్టేందుకు రూ.70 వేల కోట్ల పెట్టుబడి
==> జెసీకే ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రూ.9 వేల కోట్ల పెట్టుబడితో పెద్ద స్థాయి డేటా సెంటర్ల నిర్మాణం. దీంతో సుమారు 2 వేల మందికి ఉద్యోగాల కల్పన
==> ఏజీపీ గ్రూప్ మొత్తం రూ.6,750 కోట్ల పెట్టుబడితో 1 గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటు.
==> బయోలాజికల్ ఈ లిమిటెడ్ (బీఈ) టీకాలు, పరిశోధన-అభివృద్ధి, తయారీ సేవల విస్తరణలో భాగంగా రూ.3,500 కోట్ల కొత్త పెట్టుబడి. 3 వేలకు పైగా ఉద్యోగాలు
==> ఫెర్టిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.2 వేల కోట్ల పెట్టుబడితో తెలంగాణలో అధునాతన ఆహారం-వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏర్పాటు. దీంతో 800 పైగా ఉద్యోగ అవకాశాలు. మరో రూ.200 కోట్ల పెట్టుబడికి ప్రతిపాదన
Also Read: Free Bus Scheme: ఆర్టీసీ ఫ్రీ బస్సుకు రెండేళ్లు పూర్తి.. తెలంగాణ ఉచిత బస్సుపై బిగ్ అప్డేట్
==> వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ లిమిటెడ్ ఫ్రీజ్–డ్రైడ్ కాఫీ ప్లాంట్ స్థాపనకు రూ.1,100 కోట్ల పెట్టుబడితో యూనిట్ ఏర్పాటు. వెయ్యి మంది వరకు ఉద్యోగావకాశాలు
==> రిలయన్స్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ రూ.1,500 కోట్ల పెట్టుబడి. వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు
==> కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్ రూ.1,000 కోట్లకు పైగా పెట్టుబడి
==> ఆర్సీ సీటీ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మూడు విడతల్లో రూ.2,500 కోట్ల పెట్టుబడి, 1,600కి పైగా ఉద్యోగాలు
==> పర్వ్యూ గ్రూప్ 50 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన గ్లోబల్ కెపాసిటీ ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటు.
==> అరబిందో ఫార్మా రూ.2 వేల కోట్లతో విస్తరణ, 3 వేలకి పైగా ఉద్యోగాల కల్పన
==> హెటెరో సంస్థ మందుల తయారీ యూనిట్ల విస్తరణకు రూ.1,800 కోట్ల పెట్టుబడి, 9 వేలకి పైగా ప్రత్యక్ష–పరోక్ష ఉద్యోగాల కల్పన
==> గ్రాన్యూల్స్ ఇండియా రూ.1,200 కోట్ల పెట్టుబడి, 3 వేల మందికి ఉపాధి కల్పన
Also Read: Harish Rao: కేసీఆర్ అంటే పోరాటం, త్యాగం.. రేవంత్ రెడ్డి అంటే వెన్నుపోటు, ద్రోహం
==> భారత్ బయోటెక్ రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో పరిశోధన, అభివృద్ధి, తయారీ సేవల కోసం ఆధునిక కేంద్రం ఏర్పాటు.
==> కేజేఎస్ ఇండియా రూ.650 కోట్ల పెట్టుబడితో యూనిట్ ఏర్పాటు. 1,551 మందికి ఉపాధి కల్పన
==> గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ పాల ఉత్పత్తి విస్తరణకు రూ.150 కోట్ల పెట్టుబడి. ఈ యూనిట్‌తో 300 మందికి ఉద్యోగావకాశాలు
==> ఆక్వెలాన్ నెక్సస్ లిమిటెడ్ క్లీన్ ఎనర్జీ ఆధారంగా 50 మెగావాట్ల నెట్ జీరో ఉద్గారాల డేటా సెంటర్ ఏర్పాటు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









