Telangana BJP War:తెలంగాణలో కాషాయ పార్టీ ఎలాగైనా పవర్‌లోకి రావాలని లెక్కలు వేసుకుంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే అధికారం కోసం ప్రయత్నించిన బీజేపీ.. ఎన్నికల సమయంలో సెల్ఫ్‌గోల్ వేసుకోవడంతో కేవలం 8 సీట్లకే పరిమితం అయ్యింది. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం పుంజుకుని ఏకంగా 8 ఎంపీ సీట్లను గెలుచుకుంది. అయితే గతంలో కంటే ఆ పార్టీకి ఓట్ల శాతం గణనీయంగా పెగిరింది.. కానీ నేతల మధ్య మాత్రం ఐక్యత లేదని అనేకసార్లు ఋజువు అయింది. తాజాగా తెలంగాణ బీజేపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గ పోరు మరోసారి బయటపడింది. తాజాగా హైదరాబాద్ కమలం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి అధ్యక్షతన బీజేపీ వర్క్ షాపును నిర్వహించారు. ఈ మీటింగ్‌కు సొంత పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పార్టీలో కొందరు నేతలకు అస్సలు పడటం లేదనేది సమాచారం.
తెలంగాణలో 2028 లక్ష్యంగా కమలం పార్టీ మిషన్ నడుపుతోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని లెక్కలు వేసుకుంటోంది. అందుకే కొద్ది రోజులుగా రాష్ట్రంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది. కానీ బీజేపీ వర్క్‌షాప్‌ను నేతలు లైట్ తీసుకుంటున్నట్టు తాజాగా జరిగిన సమావేశంలో స్పష్టమైంది. ఇక బీజేపీ ఆఫీసులో వర్క్ షాపుకు సంబంధించిన హాజరు కావాలంటూ ముందుగానే సమాచారం పంపినా నేతలు వాటికి కొంతమంది నాయకులు బేఖాతరు చేశారు. ఆ మీటింగ్ కు వస్తే ఏంటి? రాకపోతే ఏంటి? అన్న చందంగా వ్యవహరించిరినట్టు తెలుస్తోంది. మెజార్టీ ప్రజా ప్రతినిధులు కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన వర్క్ షాపుకు హాజరుకాకపోవడంతో పార్టీలో లుకలుకలు బయటపడ్డాయనేది ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీలో ఎటువంటి విభేదాలు లేవనే సంకేతాలిస్తున్నప్పటికీ.. కిషన్‌రెడ్డి సారథ్యంలో జరిగిన కీలక సమావేశానికి అత్యధిక సంఖ్యలో ప్రజా ప్రతినిధులు హాజరుకాకపోవడం మాత్రం చర్చనీయాంశంగా మారింది.
ఇక బీజేపీ వర్క్ షాప్‌కు కేవలం ఎంపీలు ఈటెల, డీకే అరుణ, ఆర్ కృష్ణయ్య, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విషయానికొస్తే కీలకమైన నేతలు ఇందుకు హాజరు కాలేదు. కేవలం నలుగురు మాత్రమే హాజరయ్యారు. ఎంపీల్లో లక్ష్మణ్ నిజామాబాద్ పర్యటనలో ఉన్నందున సమావేశానికి రాలేదనేది సమాచారం. మరోవైపు ధర్మపురి అరవింద్, గోడం నగేశ్ లు వర్క్ షాపుకు దూరంగా ఉన్నారు. ఇక బండి సంజయ్ కరీంనగర్ పర్యటనలో బిజీబిజీ ఉండటంతో సమావేశానికి హాజరు కాలేదని సమాచారం. మరోవైపు బీజెఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి నిర్మల్ పర్యటనలో ఉన్నారట. ఇలా పలువురు కీలక నేతలు దూరంగా ఉండటంతో పార్టీ భవిష్యత్ కార్యక్రమాల రూపకల్పన ఎలా జరుగుతుందనే అంశం కమలం పార్టీలో చర్చనీయాంశమైంది.
ఇదిలా ఉంటే కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బీజేపీ వర్క్ షాపులో మాటల యుద్ధం జరిగినట్టు తెలుస్తోంది. ఈ మీటింగ్‌లో పొంగులేటి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర ఇంచార్జ్ అభయ్ పటేల్ మధ్య హాట్‌హాట్ డైలాగ్ వార్ నడిచిందట. ముఖ్యంగా తెలంగాణలో తిరంగా యాత్ర బాగా జరిగిందని ఇంచార్జ్ అభయ్ పటేల్ చెప్పారట. అంతేకాకుండా తెలంగాణలో జరిగినట్టు కర్నాటకలో కూడా జరగలేదని అన్నారట. దీంతో కార్ణాటక ఇంచార్జ్ సుధాకర్ రెడ్డి అభయ్ పటేల్ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్దం జరిగినట్టు సమాచారం. తనని అవమానించే విధంగా మాట్లాడటం సరికాదన్నారు సుధాకర్ రెడ్డి. దీంతో పొంగులేటిపై ఒక్కసారిగా లేచి గట్టిగా అరిచారట బీజేపీ నేతలు. కర్నాటక ఇంచార్జ్ గా ఉన్న పొంగులేటికి తెలంగాణలో పెత్తనం ఏంటని ప్రశ్నించారట. ఏదైనా ఉంటే కర్నాటకలో చూసుకోవాలని బీజేపీ నేతలు అన్నట్లు సమాచారం. ఇదే సమావేశంలో తెలంగాణ ఇంచార్జ్ అభయ్ పటేల్ లీడర్లకు క్లాస్ తీసుకున్నట్టు సమాచారం.
బీజేపీ వర్క్‌షాప్‌లో సీరియస్ మీటింగ్ జరిగితే వెనుకాల కూర్చుని ముచ్చట్లు పెట్టడం సరికాదని సుతి మెత్తగా చెప్పినట్టు సమాచారం. అంతేకాదు మీడియాతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదని తేల్చి చెప్పారట. ఎంతటి వారైనా పార్టీ లైన్ కు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసినట్టు సమాచారం. అంతేకాదు మూడు నాలుగు సార్లు గెలిచాం కాబట్టి మేము ఏది మాట్లాడినా సాగుతుందని అనుకోవడం మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారట. మీరు మాట్లాడే మాటలతో పార్టీకి నష్టం జరుగుతుందని అంటూనూ కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే ఇలా చేస్తే తనదారి తనకు చూపించామని చురకలంటించారట. మొత్తంగా టీ బీజేపీ వర్క్‌షాప్ మాత్రం తీవ్ర కలకలం రేపుతోందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు తెలంగాణ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు పార్టీలో కిషన్ రెడ్డితో పాటు మిగతా నాయకులతో విభేదిస్తున్నారు. మొత్తంగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ కట్టుదాడుతున్నారు. ఇక రాజా సింగ్ సమర్థించే వాళ్లు ఉన్నారు. ఆయన్ని విమర్శించే వాళ్లున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
Also Read: NTR Sensational Record: తెలుగులో మరే ఇతర హీరోలు బ్రేక్ చేయని రికార్డు సాధించిన అన్న ఎన్టీఆర్..
Also Read: Nandamuri Heroes: నందమూరి మూడు తరాల హీరోలు కలిసి నటించిన ఈ సినిమా తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









