Telangana BJP: కన్ఫ్యూజన్ లో కాషాయం..! బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై కొనసాగుతున్న సస్పెన్స్..

Telangana BJP: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి ప్రకటన ఎందుకు ఆలస్యం అవుతుంది..నెలల గడుస్తున్నా రాష్ట్ర అధ్యక్షుడిని ఎవరిని నియమించాలో అధిష్టానం తేల్చుకోలేకపోతుందా..? అధ్యక్షుడి ప్రకటన ఇద్దరి నేతల వల్లే ఆలస్యం అవుతుందా..? భావజాలమా..? బలోపేతమా అనే గందరగోళంతోనే ప్రెసిడెంట్ ప్రకటన ఆగిందా..? ప్రధానీ నరేంద్ర  మోడీ  భరోసా ఒకరికి ఉండగా ఆర్ఎస్ఎస్ బలం మరొకరికి ఉందా..? ఈ పేచీయో అధ్యక్షుడు ఎవరిని తేలకపోవడానికి కారణమా..?

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 9, 2025, 06:55 AM IST
Telangana BJP: కన్ఫ్యూజన్ లో కాషాయం..! బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై కొనసాగుతున్న సస్పెన్స్..

Telangana BJP: తెలంగాణ బీజేపీకీ నూతన అధ్యక్షుడి ప్రకటన మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. మరి కొద్ది రోజుల పాటు కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా కొనసాగుతారని రాష్ట్ర నేతలకు ఢిల్లీ పెద్దలు సమాచారం ఇచ్చారు. ఈ పాటికే అధ్యక్షుడి ప్రకటన జరగాల్సి ఉండగా కొన్ని కారణాలతోనే అధ్యక్షుడి ప్రకటన ఆలస్యం అవుతుందని పార్టీ జోరుగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే కేరళతో పాటు పలు రాష్ట్రాలకు అధ్యక్షులను ప్రకటించారు. తమిళనాడులో కూడా అన్నామలై పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. త్వరలో అక్కడ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. అయినా.. తెలంగాణలో మాత్రం కన్ప్యూజన్ కొనాసాగుతుంది.  గత కొద్ది నెలలుగా పార్టీ అధ్యక్షుడి ప్రకటన రేపో మాపో ఉంటుందంటూ రాష్ట్ర నేతలు తెగ హడావుడి చేశారు కానీ తీరా చూస్తే అధిష్టానం తెలంగాణ నేతలకు షాక్ ఇచ్చింది. ఇప్పట్లో కొత్త అధ్యక్షుడి ప్రకటన ఉండబోదని చావు కబురు చల్లగా చెప్పింది. దీంతో అధ్యక్షుడి రేసులో ఉన్న నాయకులు తెగ డీలా పడిపోయారు.

Add Zee News as a Preferred Source

ప్రస్తుతం బీజేపీ పెద్దలు జాతీయ అధ్యక్షుడిని ఎవరిని నియమించాలో పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. జాతీయ అధ్యక్షుడి రేసులో పలువురి పేర్లు పరిశీలిస్తుంది. వీలైనతంత త్వరగా జాతీయ అధ్యక్షుడి ప్రకటన చేయాలని అధిష్టానం భావిస్తుంది. 2014 నుంచి ఇప్పటి వరకు బీజేపీ వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చింది. మొదటి సారి రాజ్ నాథ్ సింగ్ జాతీయ అధ్యక్షుడిగా ఉండగా రాజ్ నాథ్ తర్వాత ప్రస్తుతం కేంద్రం హోంమంత్రిగా ఉన్న అమిత్ షా జాతీయ అధ్యక్షుడి బాధ్యతలు స్వీకరించారు. ఒక వైపు ప్రధానీగా నరేంద్ర మోడీ,  మరోవైపు పార్టీ అధ్యక్షుడిగా అమిత్ షా ఈ ఇరువురి నాయకత్వంలో బీజేపీ గతంలో ఎప్పుడూ లేనట్లుగా అనేక విజయాలు సాధించింది. అమిత్ షా తర్వాత జేపీ నడ్డా ప్రస్తుతం నేషనల్ ప్రెసిడెంట్ గా ఉన్నారు..వరుసగా హ్యాట్రిక్ విజయం అందుకున్న కాషాయపు పార్టీ మరోసారి కూడా కేంద్రంలో అధికారంలోకి  వచ్చి రికార్డు సృష్టించాలనుకుంటుంది. అందుకోసం ఇప్పటి నుంచే వ్యూహాలు అమలు చేస్తుంది. దీనికి అనుగుణంగా త్వరలో ఒక నూతన బీజేపీ అధ్యక్షుడిగా ప్రకటించనున్నారు.

ఇదీ చదవండి:  Sri Rama Navami 2025: వెండితెర శ్రీరాముళ్లు..

ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..

ఇది ఇలా ఉంటే ఇక తెలంగాణ విషయానికి వస్తే మాత్రం అధ్యక్షుడి ప్రకటనలో రకరకాల మలుపులు తిరుగుతుంది. రోజుకొకి పేరు తెరమీదకు తెచ్చి పార్టీ క్యాడర్ ను గందరగోళం చేస్తున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి రేసులో ముఖ్యంగా ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో ఒకటి కేంద్ర మంత్రి బండి సంజయ్ కాగా మరొక పేరు మల్కాజ్  గిరి ఎంపీ ఈటెల రాజేందర్ . ఈ ఇద్దరి నేతల మధ్య అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది అని పార్టీలో తెగ ప్రచారం జరుగుతుంది. ఈ ఇద్దరిలో ఎవరిని అధ్యక్షుడిగా నియమించాలో అధిష్టానం తేల్చుకోలేకపోతుందని పార్టీలో గుసగుసలు వినబడుతున్నాయి.

కేంద్రమంత్రి బండి సంజయ్ కు ఆర్ఎస్ఎస్ బలంగా అండగా ఉంటుంది. గతంలో బండి సంజయ్ అధ్యక్షుడు అయ్యాకే తెలంగాణలో బీజేపీకీ ఊపు వచ్చిందని పార్టీలోని కొందరు నేతలు బాహాటంగానే అంటున్నారు. దీంతో బండి సంజయ్ ను మరోసారి అధ్యక్షుడిగా ప్రకటిస్తే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అనేది బండి సంజయ్ మద్దతుదారుల వాదన.  ఇదే సమయంలో అధ్యక్షుడి రేసులో ఉన్నా ఈటెల రాజేందర్ దీనికి పూర్తిగా భిన్నమైన తీరు. ఈటెల రాజేందర్  అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. ఆ తర్వాత నెమ్మదిగా పార్టీలో పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. పార్లమెంట్ సభ్యుడు కావడంతో ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ఇవే ఇప్పుడు ఈటెల రాజేందర్ ను అధ్యక్షుడి ప్రచారం నిలబెట్టింది. తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తింపు, అదే సమయంలో బీసీ వర్గానికి చెందడం అందులోను బీసీలో అధికంగా జనభా కలిగిన ముదిరాజ్ సామాజికవర్గంకు చెందిన వాడు కావడం ఈటెలకు ప్లస్ గా మారింది. అధిష్టానం ఈటెల వైపు కూడా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ ఇద్దరి నేతలకు అధిష్టానం ఆశీస్సులు ఉండడం విశేషం. ఈటెల రాజేందర్ కు ప్రధానీ మోడీ అండదండలు ఉంటున్నట్లు తెలుస్తుంది. అదే సమయంలో బండి సంజయ్ కు అమిత్ షా తో పాటు నడ్డా మద్దతు ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఎవరిని అధ్యక్షుడిగా ప్రకటించాలో అధిష్టానం కూడా అయోమయానికి గురవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో  ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డిని మరి కొద్ది రోజుల పాటు కొనసాగించాలని నిర్ణయించినట్లుగా తెలిసింది. దీంతో అధ్యక్షుడి ప్రకటన ఉంటుందని భావించిన నేతలకు అధిష్టానం పెద్ద షాక్ నే ఇచ్చిందని పార్టీలో నేతలు  చెవులు కొరుక్కుంటున్నారు.

ఐతే ఇప్పుడు కాకున్నా ఏదో ఒక రోజు అధ్యక్షుడి ప్రకటన చేయాల్సి ఉంటుంది కదా అధిష్టానం వెంటనే కొత్త అధ్యక్షుడిని నియమిస్తే పార్టీ గాడిలో పడే అవకాశం ఉంటుందని కొందరి నేతల  వాదన. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయాల్లో దూసుకుపోతుంటే  బీజేపీ మాత్రం అధ్యక్షుడు ఎవరిని చేయాలో తేల్చుకోలేకపోతుందని పొలిటికల్ గా డిస్కషన్ జరుగుతుంది. వీలైనంత త్వరగా అధ్యక్షుడిని ప్రకటిస్తే పార్టీనీ బలోపేతం చేసే అంశంపై దృష్టి పెట్టినట్లు అవుతుందని పార్టీ నేతలు కూడా అనుకుంటున్నారు. మొత్తానికి అధ్యక్షుడి ప్రకటన ఎప్పటిలోగా ఉంటుందో మాత్రం అధిష్టానమే నిర్ణయించాల్సి ఉంది.

(రచయత.. ఇందుప్రియాల రాధాకృష్ణ)

READ ALSO:  Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

READ ALSO:  Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News