MLA Defection Case: తెలంగాణలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుపై ఇవాళ స్పష్టత వస్తుందని అంతా ఎదురుచూసిన నేపధ్యంలో మరోసారి వాయిదా పడింది. మార్చ్ 4వ తేదీన ఈ కేసుపై స్పష్టత రావచ్చని తెలుస్తోంది.
తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పది మంది ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ పది మందిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కోరినా స్పీకర్ పట్టించుకోలేదు. దాంతో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ. పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా అమలు చేయడం లేదంటూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటీషన్ వేశారు. మరోవైపు ఇదే అంశంపై కేటీఆర్ కూడా మరో పిటీషన్ వేశారు. ఈ రెండు పిటీషన్లను కలిపి జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసు విచారణ సందర్భంగా గత విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అనర్హత నిర్ణయం తీసుకునేందుకు తగిన సమయం కావాలని తెలంగాణ ప్రభుత్వం కోరగా ఇప్పటి వరకూ తీసుకున్న 10 నెలల సమయం సరిపోలేదా అంటూ కోర్టు ప్రశ్నించింది. మీ ఉద్దేశ్యంలో రీజనబుల్ టైమ్ అంటే ఎంత అని అడిగింది. ఆ తగిన సమయం ఎంతో చెప్పకపోతే తామే కలుగుజేసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది. ఆ తరువాత విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది.
బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీ, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిపై అనర్హత వేటుకు సంబంధించిన కేసు ఇది. ఈ కేసుపై ఇవాళ స్పష్టత వస్తుందని అంతా భావించారు. కానీ తెలంగాణ అసెంబ్లీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ విచారణకు హాజరు కాకపోవడంతో సుప్రీంకోర్టు ఈ కేసును మార్చ్ 4వ తేదీకి వాయిదా వేసింది. ఈసారి జరిగే విచారణలో ఈ పది మంది ఎమ్మెల్యేల అనర్హతపై స్పష్టత రావచ్చు.
Also read: MLC Elections: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆశావహులు ఎవరు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









