Telangana Budget Session 2025: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ధ్వజమెత్తింది. మొత్తంగా గవర్నర్ ప్రసంగం మొత్తం తప్పుల తడక అని చెప్పుకొచ్చారు. అందులో ఒక్కటి కూడా నిజం లేదన్నారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జూనియర్ లెక్చరర్లకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సందర్భంగా... కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
బీఆర్ఎస్ పార్టీ వాళ్లు స్ట్రేచర్ ఉందని విర్రవీగారు..కానీ స్ట్రెచర్‌పై పడ్డారనీ... ఇకనైనా వైఖరి మార్చుకోవాలన్నారు. బాధ్యాతాయుత ప్రతిపక్షంగా వ్యవహరించాలన్నారు. లేకపోతే స్ట్రెచర్ నుంచి మార్చురీలోకి వెళ్లడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
ఈ వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. తమ నేత చావును సీఎం రేవంత్ కోరుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉండగానే ఢిల్లీకి వెళ్లారు. ముఖ్యంగా విదేశాంగ మంత్రితో పాటు పలువురు కేంద్ర పెద్దలను కలవనున్నారు. అటు రాహుల్ గాంధీతో పాటు మంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నారు.
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.