Telangana Cabinet Decisions: తెలంగాణలో మారుతున్న పరిణామాల నేపథ్యంలో సమావేశమైన తెలంగాణ మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో కొన్ని ప్రతిష్టాత్మక అంశాలకు సంబంధించి ఆమోద ముద్ర వేసింది. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో దాదాపు 6 గంటలకు పైగా జరిగిన సమావేశంలో మంత్రిమండలి కీలక అంశాలపై చర్చించింది. అధికారులు, మంత్రులతో చర్చలు జరిపిన అనంతరం మంత్రిమండలి కొన్ని కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. మంత్రిమండలిలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!
Also Read: Water Bottle Fine: వాటర్ బాటిల్‌కు ఎక్స్‌ట్రా రూ.27 తీసుకున్నందుకు రూ.27 లక్షల భారీ జరిమానా
ఫ్యూచర్ సిటీ
ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) ఏర్పాటుకు నిర్ణయం. 7 మండలాలు, 56 గ్రామాలతో ఎఫ్‌సీడీఏ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నాగార్జునసాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే మధ్యన ఉన్న దాదాపు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం. 36 గ్రామాలను హెచ్‌ఎండీఏ పరిధి నుంచి తొలగించి ఎఫ్‌సీడీఏకు అప్పగింతకు ఆమోదం. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీకి రెగ్యులర్, ఔట్ సోర్సింగ్ కలిపి 90 పోస్టులు మంజూరు చేస్తూ మంత్రివర్గం ఆమోదం.
Also Read: New Posts For Employees: ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. రెవెన్యూ శాఖలో నూతన అధ్యాయం
హెచ్‌ఎండీఏ పరిధి విస్తరణ
హెచ్‌ఎండీఏ పరిధిని రీజినల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలన ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదించింది. మొత్తం 11 జిల్లాలు, 104 మండలాలు, 1,355 గ్రామాలతో హెచ్‌ఎండీఏ పరిధి పెరగనుంది. ఈ విస్తరణతో కొత్తగా 332 రెవెన్యూ గ్రామాలు హెచ్‌ఎండీఏ పరిధిలో కలవనున్నాయి.
ఒకే గొడుగు కిందకు
మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంలో భాగంగా ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 పేరిట కొత్త విధానానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాలు, సెర్ప్ ఆధ్వర్యంలో, పట్టణ ప్రాంతాల్లో మెప్మా అధ్వర్యంలో కార్యకలాపాలు చేపడుతున్న వాటిని అన్ని మహిళా శక్తి సంఘాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం. ఇందిరా మహిళా శక్తి సంఘాల్లోని సభ్యుల రిటైర్మెంట్ వయసును 60 ఏండ్ల నుంచి 65 ఏళ్లకు పెంచి.. గ్రూపుల్లో చేరే కనీస వయసుసును 18 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు ప్రభుత్వం తగ్గింపు
యాదాద్రి బోర్డు
టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి ఆలయ బోర్డు ఏర్పాటుకు మంత్రిమండలి నిర్ణయం. తెలంగాణ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ -1987కు సవరణలకు ఆమోదం.
మంత్రివర్గ కీలక నిర్ణయాలు ఇవే!
- ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
- బీసీల రిజర్వేషన్లను 42 శాతం పెంచే ముసాయిదా బిల్లుకు ఆమోదం
- తెలంగాణ టూరిజం పాలసీ 2025-2030 కి మంత్రివర్గం ఆమోదం.
- మే నెలలో జరిగే మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ లో ఆతిథ్యం ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం.
- 10,954 గ్రామ పరిపాలన అధికారుల (GPO- Grama Palana Officer) నియామకానికి ఆమోదం తెలిపిన మంత్రి వర్గం.
- గంధమల్ల రిజర్వాయర్ కెపాసిటీని 4.28 టీఎంసీల నుంచి 1.41 టీఎంసీల కు తగ్గించాలని నిర్ణయం
- శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ సమీపంలో రాయికుంట గ్రామంలో 5.15 ఎకరాల భూమిని 100 పడకల ఈఎస్ఐ (ఈఎస్‌ఐ) ఆసుపత్రి నిర్మాణానికి కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం.
- పారాలింపిక్స్ 2024 కాంస్య పతక విజేత దీప్తి జీవాంజీకి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు మంత్రివర్గం నిర్ణయం.
- కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాల్లో 361 పోస్టులకు ప్రభుత్వ ఆమోదం తెలిపింది.
- తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూట్ సొసైటీ పరిధిలో 330 రెగ్యులర్ పోస్టులకు, 165 ఔట్ సోర్సింగ్.. మొత్తం 495 పోస్టులకు మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









