)
Telangana Ministers Council Meeting: సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, ఐదు డీఏలు పెండింగ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు, పీఆర్సీ తదితర సమస్యలతో ఉద్యోగ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వేళ తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరిగింది. త్రిసభ్య కమిటీ నివేదిక, ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు, వారి డిమాండ్లు, జేఏసీ ప్రతిపాదనలు వంటి అన్ని అంశాలను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. వాటిపై మంత్రివర్గంలో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అవేమిటో తెలుసుకుందాం.
ఉద్యోగులకు మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఉద్యోగులకు రెండు కరువు భత్యం చెల్లించాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. అయితే ఇక్కడ ఒక మెలిక పెట్టారు. ఇప్పటికిప్పుడు ఒక డీఏ మాత్రమే అమలు చేస్తామని.. మరో డీఏ 6 నెలల తర్వాత అమలు చేస్తామని ప్రకటించడం గమనార్హం.
పెద్ద మనసుతో..
'ఉద్యోగుల సమస్యలపై సీఎం ముగ్గురు ఉన్నతాధికారులతో కమిటీ వేశారు. మంత్రివర్గ ఉప సంఘం కూడా ఏర్పాటు చేశారు. ఉద్యోగులను మా కుటుంబసభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికి చేర్చడంలో ఉద్యోగుల పాత్ర కీలకమైనది. వారి సంక్షేమానికి సంబంధించి మంత్రివర్గంలో లోతుగా చర్చించాం. అధికారులు నివేదించిన అంశాలు, మంత్రివర్గ ఉప సంఘం ముందు ఉద్యోగ సంఘాలు పెట్టిన డిమాండ్లను మంత్రివర్గానికి వివరించా. ఉద్యోగుల డిమాండ్లను మంత్రివర్గ సహచరులు పెద్ద మనసుతో అర్థం చేసుకొని ఆమోదం తెలిపారు' అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
హెల్త్ కార్డులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook