
Telangana Cabinet: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. ఢిల్లీలో పార్టీ అధిష్టానంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ముఖ్యుల కీలక భేటీ ముగిసింది. ఉగాదికి కొత్త మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. ఒకరిద్దరికి ఉద్వాసన పలకనున్నట్టు స్పష్టమైన సమాచారం అందుతోంది.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు లైన్ క్లియర్ అయింది. ఉగాది కొత్త మంత్రివర్గం ఖరారు కానుంది. ఖాళీగా ఉన్న బెర్త్ లు భర్తీ చేయడంతో పాటు ఒకరిద్దరిని తప్పించనున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై చాలాకాలంగా చర్చ నడుస్తోంది. ఎట్టకేలకు నిన్న సోమవారం ఢిల్లీలో పార్టీ అధిష్టానంతో కీలక భేటీ ముగిసింది. కేసీ వేణుగోపాల్ ఇంట్లో జరిగిన ఈ భేటీకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు హాజరయ్యారు. మంత్రివర్గ విస్తరణ, మార్పులు చేర్పులపై చర్చించారు. కీలకమైన నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
ఎవరు ఇన్ ఎవరు అవుట్
ప్రస్తుతం తెలంగాణలో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఒకరిద్దరిని తప్పించే ఆలోచన ఉంది. అంటే మొత్తం 7-8 మంత్రి పదవులు భర్తీ కానున్నాయి. ఎవరు ఇన్, ఎవరు అవుట్ అనే విషయంలో కాంగ్రెస్ పెద్దలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అనవసరమైన వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీ పరువు ప్రతిష్టకు భంగం కల్గించారనే కారణంతో పాటు ఇతర అభియోగాలతో కొందరిని మంత్రి పదవి నుంచి తప్పించడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. మరో వైపు జూపల్లి కృష్ణారావును సైతం కేబినెట్ నుంచి తప్పించే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్టు సమాచారం.
తెలంగాణ కేబినెట్లో ఇప్పటి వరకు ముస్లిం మైనార్టీ లేకపోవడంతో ఆ వర్గం నుంచి ఒకరికి బెర్త్ ఖరారు కావచ్చు. దీనికోసం ఎమ్మెల్సీ మీర్ అమీర్ అలీఖాన్, షబ్బీర్ అలీ పేర్లు విన్పిస్తున్నాయి. ఇక రెండు మంత్రి పదవులు బీసీలకు ఇచ్చే ఆలోచన ఉంది. ఈ కోటాలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్లు విన్పిస్తున్నాయి. ఇక ఎస్సీ కోటాలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రిపదవి దక్కవచ్చు. రెడ్డి కోటాలో మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి లేదా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్లు విన్పిస్తున్నాయి.
కొత్తగా మంత్రివర్గం ఏర్పాటయ్యాక కొందరి శాఖలు కూడా మారే అవకాశం కన్పిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్ద ఉంచుకున్న హోం, మున్సిపల్, విద్యా శాఖల్ని ఇతరులకు కేటాయించే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి