Revanth Reddy:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ మంత్రివర్గణ విస్తరణ నేపథ్యంలో ఢిల్లీ బాట పట్టనున్నారు.ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖార్గేతో భేటి అయ్యారు. అంతేకాదు క్యాబినేట్ విస్తరణకు వాళ్ల నుంచి అనుమతులు తీసుకున్నట్టు సమాచారం. ఈ సారి మంత్రి వర్గం నుంచి ఇద్దరిని తెలిగించి ఆరుగురు కొత్తవాళ్లకు ఛాన్స్ ఇవ్వనున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.మొత్తంగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు టైమ్ వచ్చేసింది. కాంగ్రెస్ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉగాదికి ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.. అయితే ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవులను భర్తీ చేస్తారంటూనే ఇద్దరిని తొలగిస్తారన్న టాక్ ఇప్పుడు కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ప్రస్తుతం నలుగురితోనే మంత్రివర్గాన్ని విస్తరిస్తారన్న చర్చ కూడా సాగుతోంది. మంత్రులుగా విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, వాకాటి శ్రీహరి, వివేక్ వెంకట స్వామి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే.. విజయశాంతికి కీలకమైన హోం శాఖ కేటాయించే అవకాశాలున్నాయనే మాట వినిపిస్తోంది. మరోవైపు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎక్సైజ్ శాఖ కేటాయించే అవకాశాలున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఫైనల్ గా ఎవరికీ ఏయే శాఖలు కేటాయిస్తారనేది చూడాలి. మిగిలిన రెండు పదవులను కూడా భర్తీ చేస్తే ఎస్టీ, మైనార్టీలకు చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరితోపాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను సైతం భర్తీ చేస్తారంటున్నారు. ఇక డిప్యూటీ స్పీకర్ ఎస్సీలో మాదిగలకు కేటాయించనున్నట్టు సమాచారం. మరోవైపు చీఫ్ విప్ పదవిని బీసీ కి ఇచ్చే అవకాశాలున్నాయి.
ఈ మేరకు ఢిల్లీలో ఈమేరకు అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి టీమ్ చర్చలు సాగాయి. విస్తరించనున్న మంత్రి పదవులకు నేతలను ఎంపిక చేసే అంశంపై.... ఎన్నికల సమయంలో పార్టీలో చేరికలప్పుడు ఇచ్చిన హామీలు, సామాజిక సమీకరణాలు, ప్రస్తుతం ఉన్న జిల్లాల ప్రాతినిధ్యం వంటి అంశాలపై రాష్ట్ర ముఖ్యనేతలందరి అభిప్రాయాలను తీసుకుని లోతుగా చర్చించినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ
సారి మంత్రి వర్గం నుంచి కొండా సురేఖతో పాటు జూపల్లి కృష్ణారావును తప్పిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
తెలంగాణలో మొత్తంగా 18 మందికి ఛాన్స్ ఉంది. ఇప్పటికే తెలంగాణ మంత్రి వర్గంలో ముఖ్యమంత్రితో కలిపి దాదాపు నలుగురు రెడ్లు ఉన్నారు. అందులో ఒకటి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీకి ఇచ్చే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.