)
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తర్వాత పూర్తిస్థాయిలో పట్టు బిగించాలనుకుంటున్న రేవంత్ రెడ్డి ఖాళీగా ఉన్న రెండు స్థానాలతోపాటు కేబినెట్‌ను పున: వ్యవస్థీకరించాలనే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈసారి కేబినెట్లో ఛాన్స్ దక్కనుందని సమాచారం. అలాగే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పార్టీ కోసం వాడుకుంటారని చర్చ నడుస్తోంది. ఒకే ఇంటి నుంచి అన్నాదమ్ములపైన ఇద్దరికి అది కూడా రెడ్డి సామాజిక వర్గానికి చోటు కల్పిస్తే.. మిగతా సామాజిక వర్గాలు నొచ్చుకుంటాయనే ఉద్దేశ్యంతో పాటు కోమటిరెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినపుడే మంత్రి పదవి హామి ఇవ్వడం మూలానా.. ఈ సారి రీ షఫిల్ చేస్తే ఆయనకు తప్పక చోటు దక్కుతుందని ఆయన వర్గీయులు చెబుతున్న మాట.
దీంతోపాటు ముగ్గురిపై వేటు ఖాయమని రేవంత్ టీమ్ ఫీలర్ వదులుతోంది. డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీ వెళ్లనున్న సీఎం హైకమాండ్ నేతలతో చర్చించి ఫైనల్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కొత్తగా అవకాశం దక్కే వారిలో విజయశాంతి ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో అందరి కన్ను ఇప్పుడు హోంమంత్రిత్వ శాఖపైనే ఉంది. ఈ రేసులో విజయశాంతి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ ఉన్నట్లు సమాచారం.
ఒక వేళ విజయశాంతికి మంత్రి పదవి ఇస్తే.. ఆమెకు మహిళ కోటాలో మంత్రి పదవి ఖాయం అనే ముచ్చట వినిపిస్తోంది. మరోవైపు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖలను మంత్రి వర్గం నుంచి తప్పించే యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. అటు జూపల్లి ప్లేస్ లో ప్రేమ్ సాగర్ రావును మంత్రిగా నియమించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై డిసెంబర్ 1 లేదా 2 తేదీల్లో క్లారిటీ రానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.