)
Telangana Local Body Elections: తెలంగాణ శాసనసభ ప్రారంభమైన తర్వాత.. రీసెంట్ గా మృతి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ కు అసెంబ్లీ ఘన నివాళి అర్పించింది. ఆ తర్వాత రేవంత్ అధ్యక్షతన తెలంగాణ అసెంబ్లీ ఆవరణో తెలంగాణ కేబినెట్ సమావేశం అయింది. ఈ సమావేశంలో స్థానిక ఎన్నికల నిర్వహణ, BCలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ లో స్థానిక సంస్థల ఎన్నికల ఇవాళ రేవంత్ రెడ్డి కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాదు సెప్టెంబర్ 30 లోగా ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని క్యాబినేట్ తీర్మానం చేసింది.
ఎన్నికల నిర్వహణకు నెల రోజుల గడువు మాత్రమే మిగిలి వుంది.ఈ రోజు జరిగిన క్యాబినేట్ భేటీ తర్వాత తెలంగాణ కేబినెట్ కమిటీలో స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకున్నారు. అటు రిజర్వేషన్ల కోటాపై పరిమితిని ఎత్తివేస్తూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి పంచాయితీ రాజ్ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో బిల్లు పెట్టనుంది ప్రభుత్వం. కేబినెట్ నిర్ణయాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలిపింది మంత్రివర్గం.
బీసీ రిజర్వేషన్లపై జీవో ఇచ్చిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. సుప్రీంకోర్టు తీర్పుతో ఎమ్మెల్సీ పదవులు కోల్పోయిన ప్రొఫెసర్ కోదండరామ్, అజారుద్దీన్‌ను శాసనమండలికి పంపాలని మంత్రివర్గం నిర్ణయించింది. అటు కాళేశ్వరం కమిషన్ నివేదిక పై బిఆర్ఎస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక పై చర్చను డైవర్ట్ చేయడానికి యూరియా కొరత అంటూ నిరసన తెలుపుతున్నారన్నారు. యూరియా కొరత సృష్టించింది కేంద్ర ప్రభుత్వం అయితే తమపై నిందలేంటని ప్రశ్నించారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీ చర్చించి ఏసీబీకి ఇవ్వాలా సిబిఐకి ఇవ్వాలా అనే నిర్ణయం తీసుకుంటామంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.