)
Revanth Delhi Tour: తెలంగాణలో ఓ వైపు జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక.. మరోవైపు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్ కు వెళ్లడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. హైకమాండ్ నేతలతో కీలక అంశాలపై చర్చించనున్నారని సమాచారం. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి పయనమయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, మంత్రుల మధ్య విబేధాలు, జిల్లా.. పట్టణ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షుల నియామకాలపై ప్రధానంగా చర్చించనున్నారని తెలుస్తోంది. హైకమాండ్ పిలుపు మేరకే ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు పయనమైనట్టు తెలుస్తోంది.
ముఖ్యంగా తెలంగాణ క్యాబినేట్ లో కొండా సురేఖ వివాదం.. ఆ తర్వాత ఆమె ముఖ్యమంత్రికి క్షమాపణలు చెప్పడం వంటివి AICC మీటింగ్ లో చర్చించబోతున్నట్టు సమాచారం. మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖార్గేకు పేస్ మేకర్ ఆపరేషన్ జరగడంతో ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. దీంతో ఢిల్లీలో ఆయనతో కాకుండా ఏఐసీసీ నాయకులతో తెలంగాణ ప్రస్తుత రాజకీయ పరిస్థితులను వివరించనున్నారు. ఈ భేటికి ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్, సోనియా గాంధీలు హాజరు కానున్నారు. మరోవైపు మల్లిఖార్జున ఖర్గే ఆరోగ్యం బాగా లేకపోవడంతో మళ్లీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రాహుల్ గాంధీ స్వీకరిస్తారా అనేది హాట్ టాపిక్ గా మారింది.
ముఖ్యంగా జూబ్లిహిల్స్ లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని ఏఐసీసీ .. రేవంత్ కు టార్గెట్ పెట్టినట్టు తెలుస్తుంది. మరోవైపు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామిల్లో కేవలం ఉచిత బస్సు మినహా మరేది అమలు చేయలేదు. దీంతో ఓ వర్గం ప్రజలు సర్కారు పై గుర్రుగా ఉన్నారు. మరోవైపు మహిళలకు ఉచిత బస్సు మూలానా.. పురుషులకు సంబంధించిన టికెట్ రేట్స్ పెంచడంపై సామాన్య ప్రయాణికులు ఆగ్రహంగా ఉన్నారు. మొత్తంగా మంత్రివర్గ సహచరులు ఒకరిపై ఒకరు బహిరంగంగా మాటలు తూటాలు పేల్చడం వంటి అంశాలు కూడా ప్రస్తావించే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.