Revanth Japan Tour: జపాన్ పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు..

Revanth Japan Tour: తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని, కలిసి నవ ప్రపంచాన్ని నిర్మిద్దామని జపాన్ పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. కొత్త ఆవిష్కరణలతో భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకు కలిసి పనిచేద్దామని ఆయన ఆకాంక్షించారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 22, 2025, 10:40 AM IST
Revanth Japan Tour: జపాన్ పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు..

Revanth Japan Tour: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ టూర్ లో బిజీ బిజీగా గడిపారు. ముఖ్యంగా హైదరాబాద్​లో 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని, ఎగుమతులకు వీలుగా సమీప ఓడరేవుతో అనుసంధానించే డ్రై పోర్టును ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఒసాకో ఎక్స్‌పో తెలంగాణ పెవెలియన్‌ను ప్రారంభించిన సీఎం అనంతరం జపాన్ పారిశ్రామికవేత్తలతో విడివిడిగా చర్చించారు.

Add Zee News as a Preferred Source

ఒసాకో ఎక్స్‌పో  భారతదేశం నుంచి పాల్గొంటున్న తొలి రాష్ట్రం తెలంగాణ  అవిర్భవించింది.  కిటాక్యూషు నగరం నుంచి ఒసాకా చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు  ఉదయం భారత పెవిలియన్​లో ప్రత్యేక తెలంగాణ జోన్‌ ప్రారంభించారు. ఐదేళ్లకు ఒకసారి జరిగే ఒసాకో ఎక్స్‌పోలో భారతదేశం నుంచి పాల్గొంటున్న తొలి రాష్ట్రం తెలంగాణేనని ప్రభుత్వం తెలిపింది. ఒసాకా ఎక్స్‌పో వేదికపై తెలంగాణ సంస్కృతి, పారిశ్రామిక అనుకూల వాతావరణం, పర్యాటక ఆకర్షణలను ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే సందర్శకులకు చాటి చెప్పేలా పెవెలియన్‌లో ఏర్పాట్లు చేశారు.

ఈ వేదిక ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, సాంస్కృతిక సహకారాన్ని వృద్ధి చేసే  దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పెవిలియన్ ప్రారంభించిన తర్వాత పలువురు జపాన్ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలతో సీఎం రేవంత్‌రెడ్డి బృందం వేర్వేరుగా సమావేశమైంది. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పారిశ్రామికవేత్తలకు వివరించారు. తెలంగాణ, జపాన్‌ల మధ్య ఉన్న చారిత్రక స్నేహాన్ని దీర్ఘకాల భాగస్వామ్యంగా మార్చుకుందామని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. కొత్త ఆవిష్కరణలతో భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకు కలిసి పనిచేద్దామనే ఆకాంక్షను ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు.

ఐటీ, బయో టెక్నాలజీ రంగాల్లో తెలంగాణ ఇప్పటికే ప్రత్యేకమైన గుర్తింపు సాధించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. వీటితో పాటు ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, టెక్స్​ టైల్స్ ​ రంగాల పరిశ్రమలకు ఉన్న అనుకూలతలను వివరించారు. హైదరాబాద్​లో 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని ఏకో, ఎనర్జీ, స్మార్ట్ మొబిలిటీ, సర్క్యులర్ ఎకానమీపై ఈ సిటీ ఆధారపడుతుందన్నారు. జపాన్‌కు చెందిన మారుబెని కార్పొరేషన్‌తో ఫ్యూచర్ సిటీలో ఇండస్ట్రియల్ పార్క్​ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. మూసీ పునరుజ్జీవనంలో భాగంగా నది పొడవునా 55 కిలోమీటర్ల అర్బన్ గ్రీన్ వే అభివృద్ధి చేయనున్నామని, ఈ విషయంలో టోక్యో, ఒసాకా నగరాలను చూసి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని అన్నారు.

ఇదీ చదవండి: భర్తపై ప్రతీకారంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ కాంట్రవర్షల్ నటి మరొకరు లేరేమో..

ఇదీ చదవండి:  కమల్ హాసన్, వాణి గణపతి ఎందుకు విడిపోయారు.. విడాకుల సందర్భంగా ఇచ్చిన భరణం ఎంతో తెలుసా.. !

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News