)
Kamareddy Flood Relief: 'వరద నష్టం ఎక్కువగా జరగకుండా అప్రమత్తమై సరైన సమయంలో స్పందించి చర్యలు చేపట్టిన అధికారుల కృషిని అభినందిస్తున్నా. పరిపాలన సౌలభ్యం కోసం వివిధ శాఖలను ఏర్పాటు చేసుకున్నాం. క్లిష్ట పరిస్థితుల నిర్వహణ సమయంలో శాఖల మధ్య సమన్వయం ఉండాలి. జిల్లా కలెక్టర్లు వివిధ శాఖలన్నింటితో సమన్వయ సమావేశాలు నిర్వహించండి. సమస్య వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా మానవత్వంతో వ్యవహరించాలి' ముఖ్యమంత్రి ఆదేశించారు. సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు పకడ్బందీగా అమలు చేయాలని చెప్పారు.
'రాబోయే 15 రోజుల్లో మరోసారి సమీక్ష నిర్వహిస్తా. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇంచార్జ్ మంత్రి సీతక్క ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తారు. ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను సమీక్షలో మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లండి. నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ నిధిని రాబట్టుకోవాలి. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత ప్రణాళికలు రూపొందించాలి' అని సీఎం తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో ఇటీవల వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. కామారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న పంటలు, వంతెనలు, రహదారులు, ప్రాజెక్టులను ముఖ్యమంత్రి గురువారం ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట్ మండలంలో పర్యటించారు. లింగంపల్లి ఖుర్ద్ వంతెన (కేకే వై హైవే)ను సందర్శించి, అక్కడ తాత్కాలిక మరమ్మతులు చేయడం కాకుండా శాశ్వత వంతెన నిర్మాణానికి అధికారులను ఆదేశించారు. అనంతరం బుర్గిద్ద వద్ద రైతుల పొలాలను పరిశీలించిన తర్వాత మహిళా రైతులతో మాట్లాడారు. పంట నష్టంపై రైతుల సమస్యలు విని, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పూర్తి స్థాయిలో సహాయం చేస్తుందని భరోసా ఇచ్చారు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ప్రత్యేక నిధుల ప్యాకేజీ మంజూరు చేసి దెబ్బతిన్న రహదారులు, వంతెనలు, మౌలిక వసతులు పునరుద్ధరించాలని స్థానిక ఎమ్మెల్యే కోరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.