)
SLBC Project: తెలంగాణలో తీవ్ర విషాదం నింపిన ఎస్ఎల్బీసీ టన్నెల పనులపై తెలంగాణ ప్రభుత్వం మేల్కొని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 22వ తేదీన ఎస్ఎల్బీసీ సొరంగం కూలి 8 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ తీవ్ర విషాద సంఘటన జరిగిన ఆరు నెలల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. ప్రాజెక్టు పనులపై సమీక్ష అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఎస్ఎల్బీసీ సమీక్షా సమావేశంలో సీఎం అధికారులతో చర్చించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. ఎస్ఎల్బీసీ పనులు ఒక్క రోజు కూడా ఆలస్యం కావడానికి వీలు లేదని స్పష్టం చేశారు. ఎస్ఎల్బీసీ కేవలం నల్గొండ జిల్లా కే కాదు తెలంగాణ అత్యంత కీలకమని ప్రకటించారు. ఎలాంటి ఖర్చు లేకుండా నీళ్లు ఇవ్వడానికి ఎస్ఎల్బీసీ అవకాశం ఉందని పేర్కొన్నారు. శ్రీశైలం నుంచి అక్కంపల్లి రిజర్వాయర్ వరకు ఉన్న సమస్యలపైన తక్షణమే సమాచారం ఇవ్వాలని కోరారు.
అటవీ శాఖ అనుమతులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. 2027 డిసెంబర్ 9లోగా ఎస్ఎల్బీసీని పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించారు. డిసెంబర్ 9, 2027న తెలంగాణ ప్రజలకు ఎస్ఎల్బీసీ అంకితం చేయాలని తెలిపారు. ఎస్ఎల్బీసీ పనులకు గ్రీన్ ఛానల్లో నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. సొరంగం పనుల కోసం కాంట్రాక్టు సంస్థ జేపీ అసోసియేట్స్ అన్ని పరికరాలను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. కాంట్రాక్టు సంస్థ ఒక్క రోజు పనులు ఆలస్యం చేసినా ఒప్పుకోనని తెలంగాణ సీఎం తెలిపారు. సొరంగం తవ్వకంలో సింగరేణి నిపుణుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఎస్ఎల్బీసీ పనులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరగాలని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఎస్ఎల్బీసీ పూర్తి కావాలని పనులు ఆగడానికి వీలు లేదని స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.