)
Telangana:స్థానిక సంస్థల్లో ఉన్న 50శాతం రిజర్వేషన్ల నిబంధనను ఎత్తివేయాలని కోరనున్నారు. రిజర్వేషన్లను పెంచుతూ శాసనసభలో ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ చట్టం సవరణ బిల్లు ఏకగ్రీవ ఆమోదం పొందింది. ఈ విషయాన్ని గవర్నర్ తెలిపి సభ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరనున్నారు. ఈ క్రమంలోనే బీసీలకు రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించాలని గవర్నర్‌ను కోరనున్నారు. గవర్నర్‌తో సమావేశానికి హాజరుకావాలని కోరుతూ బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ పక్ష నేతలకు ప్రభుత్వం లేఖలు రాసింది. ఆ లేఖలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయా పార్టీల నేతలకు స్వయంగా అందజేశారు.
బీఆర్ఎస్ తరఫున ప్రతిపక్ష నేత కేసీఆర్ అందుబాటులో లేకపోవడంతో కేటీఆర్‌కు, బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డికి, ఎంఐఎం తరఫున ఎమ్మెల్యే బలాలకు, సీపీఐ పక్ష నేత కూనంనేని సాంబశివరావుకు అందించారు.ప్రభుత్వం తరఫున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, బీసీ ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలవనున్నారు. కాగా స్థానికంగా జరిగే ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అధికారంరాష్ట్రాలకు ఉందని మంత్రి పొన్నం వెల్లడించారు.
న్యాయపరంగా అన్ని విషయాలను తెలుసుకునే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న నిర్ణయానికి వచ్చామన్నారు. అఖిలపక్ష నేతలతో సోమవారం గవర్నర్‌ను కలిసి.. ఈ విషయంలో సభ్యులందరూ ఏకాభిప్రాయంతో ఉన్న విషయం వివరిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బలహీన వర్గాలకు చెందిన మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు తమ ప్రయత్నాన్ని గుర్తించాలన్నారు. బీసీలకు 42 రిజర్వేషన్ కల్పించే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. శాసనసభ లాబీల్లో ఆదివారం పొన్నం మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.