Telangana Delimitation: డీ లిమిటేషన్ పై ప్రస్తుతం పెద్ద రచ్చ నడుస్తోంది. రాజ్యాంగం ప్రకారం చేసే ఈ నియోజకవర్గాల పునర్వజనకు కేంద్రంలోని బీజేపీ సర్కారకు ప్రమేయం లేరంటున్నారు. మరోవైపు దక్షిణాదిలో స్టాలిన్ సహా కొంత మంది నేతలు కేంద్రంపై మాట్లాడానికి ఏ ఇష్యూ లేని కారణంగా డీ లిమిటేషన్ అంటూ నాటకాలు ఆడుతున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా స్టాలిన్ పై ప్రజాగ్రహం పెరగడంతో పాటు లిక్కర్ స్కాం సహా పలు అంశాలపై అక్కడ ప్రభుత్వం పై తీవ్ర ఆరోపణలు ఎదుర్కుంటుంది. దాని నుంచి డైవర్ట్ చేయడానికి డీ లిమిటేషన్ ఇష్యూ ఎత్తుకున్నారనేది బీజేపీ వాళ్ల వాదన. ముఖ్యంగా దక్షిణాదిలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవడానిక ఇండి కూటమి నేతలు చెన్నై వేదికగా ఒక్కటయ్యారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
తాజాగా జరిగిన ఈ డీ లిమిటేషన్ కు సంబంధించిన భేటికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆ పార్టీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ హాజరయ్యారు. అటు బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. చెన్నైలో జరిగిన ఈ భేటి తర్వాత సీఎం రేవంత్ రెడ్డి
డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా నేడు అసెంబ్లీలో తీర్మానం చేయనున్నారు. ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు.
దీనిపై వివిధ రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు తెలపనున్నాయి. బీజేపీ మినహా మిగిలిన పక్షాలన్నీ డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు పెరిగే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదనే విమర్శలు కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా ఇండి కూటమి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో సీట్లు పెంచుకుని మళ్లీ అధికారంలోకి రావాలని కమలం పార్టీ ప్రయత్నిస్తున్నదని వివిధ రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయ ప్రాతినిధ్యం తగ్గేలా చేసి ఇక్కడి రాష్ట్రాలను నామమాత్రం చేయాలని మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని, కాంగ్రెస్ సహా ప్రాంతీయ పార్టీలన్నీ అభిప్రాయపడుతున్నాయి. అలాగే రెండు బిల్లులపై చర్చించి సభ ఆమోదించనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.