)
Telangana Goverment going to fight on Supreme court: బీసీ రిజర్వేషన్ల అంశం .. కోర్టులో వీగిపోతుందని తెలిసే రేవంత్ రెడ్డి కావాలనే బీసీ లపై ప్రేమ ఉన్నట్టు ఈ రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చి నాటాకలు ఆడిందనేది ప్రతిపక్షాల ఆరోపణ. ఏ రిజర్వేషన్స్ అయినా.. 50 శాతానికి మించకూడదన్న రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఉన్నా సరే.. వచ్చే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీసీల ఓట్ల కోసం రేవంత్ రెడ్డి ఆడిన గేమ్ ప్లాన్ అని బీఆర్ఎస్, బీజేపీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. బీసీలపై అంత చిత్తశుద్ది ఉంటే.. రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రి పీఠాన్ని బీసీలకు అప్పగించాలని చెబుతున్నాయి. మరోవైపు హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలా లేదా హైకోర్టులో తుది తీర్పు వచ్చే వరకు వేచి చూడాలా అనే దానిపై సహచర మంత్రులతో పాటు పార్టీలో చర్చించనున్నట్లు సమాచారం.
హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను పూర్తిగా అధ్యయనం చేసి, న్యాయ నిపుణుల సూచన మేరకు తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో రెండు రోజుల పాటు సుదీర్ఘ వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్‌పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాలకు దాఖలుకు పిటిషనర్లకు రెండు వారాల గడువు విధించింది.
తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పైనా హైకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ ఆరు వారాలపాటు నిలిచిపోనుంది.తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేస్తున్నట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటన చేసింది. ఈ మేరకు గురువారం సాయంత్రం గెజిట్ జారీ చేసింది. గతనెల 29న ఇచ్చిన ఎన్నికల షెడ్యూల్‌ను రద్దు చేసింది. తదుపరి నోటిఫికేషన్ వచ్చే వరకు ఈ నోటిఫికేషన్‌ను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఈసీ స్పష్టం చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.