Telangana Cold Waves: తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. మరికొన్ని రోజులు వణుకుడే..

Telangana Cold Waves: తెలుగు రాష్ట్రాలను చలి పులి వణికిస్తోంది. వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు భారీ పడిపోనున్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరించారు. తెలంగాణలో 18 జిల్లాల్లో 9-12డిగ్రీలు, 12 జిల్లాల్లో 6-9 డిగ్రీల వరకు టెంపరేచర్స్ పడిపోతాయని అంచనా వేశారు.   

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 10, 2025, 10:04 AM IST
Telangana Cold Waves: తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. మరికొన్ని రోజులు వణుకుడే..

డిసెంబర్ 10 నుంచి 13 వరకు ఉత్తరాది నుంచి వీస్తోన్న  తీవ్రమైన చలిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పగటి వేళల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా వారం నుంచి చలి తీవ్రత బాగా పెరిగింది. అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌కు పడిపోయి ప్రజలు గజగజ వణుకుతున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 6 నుంచి 9 డిగ్రీల వరకు నమోదైనట్టు హైదరాబాద్‌ వాతావరణ శాఖ ప్రకటనలో తెలిపింది. 

Add Zee News as a Preferred Source

దాదాపు 20 జిల్లాల్లో 10 డిగ్రీల్లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, 13 తేదీల వరకు మరింత తీవ్రమైన చలిగాలులు వీస్తాయని వెల్లడించింది. దీని ప్రభావంతో ఉదయం, సాయంత్రం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. మంగళవారం కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణిలో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత 6.1 డిగ్రీలు, ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం అర్లీ(టీ)లో 6.3, సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలో 6.4, వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేటలో 6.9 డిగ్రీలుగా నమోదైనట్టు పేర్కొన్నది. 

Read more:  Chiranjeevi: పాయే.. మరోసారి చిరంజీవి పరువు పాయే..

Read more:  నాగార్జున ‘శివ’ 4K రీ రిలీజ్ టోటల్ కలెక్షన్స్.. సీనియర్ హీరోల్లో నాగార్జున సరికొత్త రికార్డు.. 

నగరంలో 16వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు 9 నుంచి 12 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నదని వివరించింది. ఆదిలాబాద్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో బుధవారం చలిగాలులు వీచే అవకాశాలున్నాయని తెలిపింది.  వృద్ధులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా బయటకు వెళ్లినప్పుడు వెచ్చని దుస్తులు ధరించాలని తెలిపింది.

Read more:​  సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..

Read more:​ సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News