Telangana Cold Waves: కార్తీకం మాసం నుంచి చలి పంజా విసరడం మొదలుపెడుతుంది. అయితే.. వర్షాల కారణంగా కాస్త ఆలస్యంగా తెలంగాణను చలి వెంటాడుతుంది. ఉన్నట్టుండి రెండు రోజులుగా ఒక్కసారి తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం మారిపోయింది. క్రమంగా చలి తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఉత్తర, మధ్య, పశ్చిమ తెలంగాణ ప్రాంతాలను చలి తీవ్రత పెరుగోంది.
పైగా ఉత్తరాదితో పాటు రాజస్థాన్ నుంచి వీచే చలిగాలులతో తెలంగాణలో కనిష్టానికి పడిపోయాయి. దీంతో ఉదయం పూట బయటకు వెళ్లాలంటే కాళ్లు చేతులు వణికే పరిస్థితులు నెలకున్నాయి. సంక్రాంతి వరకు ఇదే పరిస్థితులు కంటిన్యూ అయ్యే అవకాశాలున్నాయి. రాబోయే రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత దిగువు చేరనున్నట్టు వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్న మాట. రాష్ట్రవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు ఇప్పటికే పడిపోయాయి.
శుక్రవారం ఉదయం ఆదిలాబాద్‌లోని బేలా ప్రాంతంలో అత్యల్పంగా 14.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.ఉదయం పూట మార్నింగ్ వాక్ వెళ్లేవాళ్లు.. కాస్త సూర్యోదయం అయ్యాక వెళితే బెటర్. వృద్దులు, హృదయ సంబంధిత రోగాలున్నవాళ్లు అప్రమత్తతో మెలగాలి. ఉదయం, సాయంత్రి వేళల్లో బయటకు వెళ్లాల్సి వస్తే .. చెవులు పూర్తిగా కప్పుకోవాలి. మఫ్లర్, స్వెట్టర్స్ వంటివి వేసుకొని బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు. మరోవైపు గోరు వెచ్చటి నీళ్లతో స్నానం చేయాలని నిపుణులు చెబుతున్న మాట.
Also Read: మీ ఏజ్ ప్రకారం రోజు ఎంత లిక్కర్ తీసుకోవాలి.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..
Also Read: చిరంజీవికి అమ్మగా.. అక్కగా.. చెల్లిగా..భార్యగా యాక్ట్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.









