Meenakshi Natarajan News Updates: తెలంగాణ కాంగ్రెస్‌లో సమస్యలను పరిష్కరించేందుకు పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ స్పీడ్ పెంచారు. ఇటీవలే పార్టీ ఇంచార్జ్‌గా బాధ్యతలు స్వీకరించిన మీనాక్షి నటరాజన్.. వచ్చిరాగనే తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అంతేకాకుండా పార్టీ లైన్ దాటినా నేతలకు క్లాస్‌లు తీసుకున్నారు. ఆ తర్వాత ప్రతి జిల్లా నుంచి నేతలను పిలిపించుకుని సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. తాజాగా మెదక్, మేడ్చల్ మల్కాజ్‌గిరి నేతలతో ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ సమావేశం అయ్యారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో పార్టీ స్థితిగతులు, ఫలితాలపై వారితో చర్చించారు. ఈ సమావేశంలో పార్టీలో పాత, కొత్త నేతల మధ్య సమన్వయం లోపించకుండా ముందుగు సాగాలని హితవు పలికినట్టు తెలిసింది. అంతేకాకుండా నియోజకవర్గ ఇంచార్జీలు బాధ్యతాయుతంగా వ్యవహరించి అందరినీ కలుపుకుపోవాలని చెప్పారట. అలాగే నియోజక వర్గ ఎమ్మెల్యేలు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించినట్టు సమాచారం..
ఆ తర్వాత మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గం నేతలతో మీనాక్షి నటరాజన్ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌కు పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ అనుబంధ సంఘాలు చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, ఇతర నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలోనే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం నేతలంతా ఐకమత్యంగా కృషి చేయాలని చెప్పారట. అటు కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలల ప్రజాపాలనలో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరిగిన అభివృద్ది , సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆదేశించారట. మరోవైపు నియోజక వర్గ ఇంచార్జ్‌లు బాధ్యతాయుతంగా వ్యవహరించి సమన్వయంతో పనిచేయాలని సూచించారట. అయితే మీనాక్షి దృష్టికి నేతలంతా పాత- కొత్తగా విడిపోయి మీనాక్షికి దర్శనం ఇస్తుండటంతో.. ఆమె సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఆదిలాబాద్ నేతలతో కొత్త ఇంచార్జ్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఆమె నేతలను మూడు గ్రూపులుగా విభజించినట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లు పార్టీకి ఇబ్బందిగా మారిన కొత్త, పాత నేతల మధ్య సమన్వయం ఇష్యుకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు సరికొత్త ప్లాన్ తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. త్రీ గ్రూప్ ఫార్ములా అమలు చేసి పార్టీలో నేతలకు పదవుల విషయంలో కొత్త విధివిధానాలు అమలుచేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పార్టీలో నామినేటేడ్ పోస్టుల భర్తీ.. పార్టీ పదవులు భర్తీ చేయాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది.. ఇప్పటికే పదవుల విషయంలో కొందరు లీడర్లు నరాజ్ అయ్యారు. కొందరైతే సీఎం రేవంత్ రెడ్డి తీరుపై బహిరంగంగానే విమర్శలకు దిగారు. దాంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు కొత్త ఫార్ములాను తెరమీదకు తెచ్చినట్టు తెలుస్తోంది..
ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నవారిని మూడు గ్రూపులుగా విభజించిన మీనాక్షి.. పార్టీలో మొదటినుంచి ఉంటున్న వారిని గ్రూప్ వన్‌లో చేర్చినట్టు సమాచారం. ఇక ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన నేతలను సెకండ్ గ్రూపులో చేర్చారని అంటున్నారు. ఇక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలను మూడు గ్రూపులో పెట్టినట్టు తెలుస్తోంది. అయితే నేతలను గ్రూపులుగా విడగొట్టడం వెనుక కారణం పదవుల పంపకాలే ఉన్నట్టు సమాచారం.. తొలి నుంచి పార్టీలో కొనసాగుతున్న లీడర్లకే త్వరలోనే జరిగే భర్తీలో అవకాశం ఇస్తారని చెబుతున్నారు. ఆ తర్వాత రెండు గ్రూపు లీడర్లకు ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు. ఇక మూడు గ్రూప్ వారికి మాత్రం చివరి దఫాలో పోస్టింగ్‌లు ఇచ్చే చాన్స్ ఉందని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి.. అయితే పార్టీలో కొత్తగా చేరిన నేతలకు.. ప్రాధాన్యత ఇవ్వకపోతే.. వారి పరిస్థితి ఏంటన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. వారంతా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా లేక.. తిరిగా సొంత గూటికి వెళ్తారా అనేది తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు ఆగాల్సిందే..!
Also Read: BCCI New Rules: ఐపీఎల్ ఆటగాళ్లకు బిగ్ అలర్ట్, ఈ రూల్స్ పాటించాల్సిందే
Also Read: Old Pension Scheme: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్‌ప్రైజ్ బొనాంజా.. ఓపీఎస్‌పై కీలక ప్రకటన..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









