Telangana: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులెవరో తేలిపోయింది. రేసులో చాలామంది ఉన్నా చివరికి ముగ్గురి పేర్లను ఫైనల్ చేసింది. ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ అధికారికంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల్ని ఖరారు చేసింది. వాస్తవానికి రేసులో చాలామంది పేర్లు విన్పించాయి. ఎమ్మెల్సీ అభ్యర్ధుల బరిలో ఓసీ కేటగరీ నుంచి నరేందర్ రెడ్డి, కుసుమ కుమార్, కుమార్ రావ పేర్లు విన్పించగా బీసీ కేటగరీ నుంచి ఇరపత్రి అనిల్, కొనగాల మహేశ్, జెర్సీటి జైపాల్, గాలి అనిల్ పేర్లు విన్పించాయి. ఇక ఎస్సీ కేటగరీ నుంచి అద్దంకి దయాకర్, జ్ఞాన సుందగర్, దొమ్మడి సాంబయ్య, రాచమల్లు సిద్ధేశ్వర్ రెడ్డి పేర్లు విన్పించాయి. అటు ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్దేతో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఫోన్ ద్వారా చర్చించారు. చివరికి ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించింది.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యో కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ఏఐసీసీ ప్రకటించింది. నాలుగో సీటును సీపీఐకు కేటాయిస్తున్నట్టు పార్టీ ప్రకటించింది. త్వరలో ఈ ముగ్గురు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎవరూ ఊహించని విధంగా విజయశాంతికి టికెట్ దక్కడం విశేషం.
Also read: Aadhaar Card: ఆధార్ కార్డు బిగ్ అప్‌డేట్, ఇలా చేయకపోతే ఆధార్ రద్దయిపోతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









