Telangana Diagnostics: తెలంగాణలో వైద్య విధానంలో డయాగ్నస్టిక్స్ అద్భుత సేవలు అందిస్తున్నాయి. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ విధానంలో వైద్య సేవలు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు అందుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన అనంతరం నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్స్ హబ్స్ ఏర్పాటుచేసింది. అయితే 2023-24 కంటే 2024-25లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు లభిస్తున్నాయి. 2023-24లో నెలకు సగటున 2,89,475 మందికి సేవలు అందించగా.. 2024-25లో సగటున నెలకు 3,24,982 మందికి సేవలందించారు.
Also Read: Girlfriend Death: బెట్టింగ్ యాప్స్‌కు ఒకరు.. ప్రియుడు పెళ్లికి అంగీకరించలేదని లవర్
2023-24లో నెలకు సగటున 10,82,537 పరీక్షలు చేస్తే.. 2024-25లో నెలకు సగటున 11,19,900 పరీక్షలు చేశారు. డయాగ్నస్టిక్స్ హబ్స్‌లో 2023-24లో 13,233 మంది ఎక్స్ రే తీయించుకోగా.. 2024-25లో 15,929 మంది ఎక్స్‌రే సేవలు వినియోగించుకున్నారు. ఈసీజీ, ఆల్ట్రాసౌండ్, టిఫా, మామోగ్రామ్ వంటి అన్ని రకాల సేవల్లోనూ 2023-24 కంటే 2024-25లో మెరుగైన సేవలు అందాయి. 92 శాతం మంది పేషెంట్లకు సాంపిల్ ఇచ్చిన రోజే రిపోర్ట్ ఆన్‌లైన్‌లో పంపిస్తున్నారు.
గతేడాది ఉట్నూర్‌లో కొత్త డయాగ్నస్టిక్స్ హబ్స్ ప్రారంభమయ్యాయి. భద్రాచలం, ఏటూరునాగారం, మన్ననూరు వంటి గిరిజన ప్రాంతాలకు సేవలను విస్తరిస్తూ అక్కడ హబ్స్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నారాయణపేట, మేడ్చల్ మల్కాజ్‌గిరిలోనూ కొత్త డయాగ్నస్టిక్స్ హబ్స్ ప్రారంభించబోతున్నారు. ఇలా అన్ని రకాలుగా తెలంగాణ డయాగ్నస్టిక్స్ హబ్స్ సేవలు విస్తరిస్తున్నారు.
గిరిజన ప్రాంతాల్లో..
గిరిజన ప్రాంతాల్లోనూ తెలంగాణ డయాగ్నస్టిక్స్ సేవలు కూడా విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయి. గతేడాది ఉట్నూరులో కొత్త హబ్ సర్కార్ ప్రారంభమైంది. ఏటూరునాగారం, మన్ననూరు, భద్రాచలంలో కొనసాగుతున్న కొత్త డయాగ్నస్టిక్స్ హబ్స్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. నారాయణపేట, మేడ్చల్‌లోనూ 2 కొత్త హబ్స్, హబ్స్ దూరంగా ఉన్న ప్రాంతాల్లో.. 174 సోక్స్ ఏర్పాటవుతున్నాయి. స్పోక్స్‌లో సేకరించిన పేషెంట్ల టెస్ట్ సాంపిల్స్‌ను తరలించేందుకు 157 వాహనాలను ప్రభుత్వం సమకూర్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









