Telangana: డీఏల గురించి వీధి పోరాటాలు చేయాలా? ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల అల్టిమేటం..

Telangana Employees Association: తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర స్థాయిలు మండిపడుతున్నాయి. డీఏ బకాయిలు ఇప్పటి వరకు లేవు. రిటైర్డ్‌ ఉద్యోగులు కూడా ఇబ్బందులు పడుతున్నారు అని ఆవేధన వ్యక్తం చేస్తున్నాయి.

Written by - Renuka Godugu | Last Updated : Mar 15, 2025, 03:58 PM IST
Telangana: డీఏల గురించి వీధి పోరాటాలు చేయాలా? ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల అల్టిమేటం..

Telangana Employees Association: తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘాలు డీఏ బకాయిలు, ఉద్యోగులు ఇతర ఇబ్బందులపై నిలదీశాయి.  అసలు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు భాగమా? కాదా? అని మండిపడుతున్నాయి. తమపై ఎందుకు ఈ విధమైన వివక్ష చూపుతున్నారు? మార్కెట్‌లలో వస్తు ధరలు పెరుగుతున్నాయి. ఈనేపథ్యంలో తము తమ కుటుంబాలు ఎలా బతకాలి అని తమ దుస్థితి దారుణంగా ఉందని వాపోతున్నారు. 

Add Zee News as a Preferred Source

ప్రతి వస్తువుపై కేంద్ర ప్రభుత్వం విధించే పన్నుతోపాటు రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్ను కూడా వసూలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి తమ బాధలు పట్టవా? అని నిలదీస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వ పథకాలను అన్ని ప్రభుత్వ పథకాలు ఫైల్‌ రాసి, పథకాలు అమలు చేసేది తాము. అంతేకాదు నీళ్లు అందించేది కూడా ప్రభుత్వ ఉద్యోగి అలాంటి తమకు డీఏలు ఇంకా అందకపోవడం దారుణం అంటున్నారు. 

ఇక ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వటమే గొప్ప అన్నట్లు ఈ ప్రభుత్వం నడుచుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు ఆరు నెలలకు ఒకసారి డీఏ ఇస్తుంది. కానీ, ఇప్పటి వరకు తన డీఏలు ఐదు పెండింగ్‌లో ఉన్నాయి వాటి పరిస్థితి ఏంటి? ఏ ప్రభుత్వం అయినా ఇప్పటి వరకు ఐదు డీఏలను ఏ వాయిదా వేసిందా? అని మండిపడుతున్నాయి. 

అంతేకాదు ఇక ఐదేళ్లకు ఒకసారి ఇచ్చే పీఆర్సీ ఎక్కడ? వీటిపై ఏం చేయాలి? ఉద్యోగులు కోర్టు చుట్టూ తిరగాలా? అని వాపోతున్నాయి. తాము దాచుకున్న జీపీఎఫ్‌ డబ్బులకు దరఖాస్తు చేసుకున్నా కానీ వాటికీ ఇప్పటికీ ఎలాంటి దాఖలాలు లేవు. అప్లై చేసుకుని ఏడాది గడించింది. కానీ ఇప్పటి వరకు దానికీ అతీ గతీ లేదు అని తమ గోడు వెళ్లబోసుకుంటున్నాయి. 

ఇదీ చదవండి: Dragon Fruit: ఈ పండుతో మీ ముఖంపై ఒక్క మచ్చ, గీత కూడా కనిపించదు..

మొత్తానికి డీఏ బకాయిలు పొందాలంటే వీధి పోరాటాలు చేయాల్సి వస్తుందా? అని కూడా ఉద్యోగ సంఘాలు తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీశాయి. వాటి కోసం వయో వృద్ధులైన రిటైర్డ్‌ ఉద్యోగులు సైతం కోర్డు చుట్టూ తిరగాలా అని నిలదీస్తున్నాయి. 11 ఏళ్ల మూడు నెలల్లో పూర్తయ్యే కమ్మూటేషన్‌ పెన్షన్‌ రికవరీకి 15 ఏళ్లు దాటినా రికవర్‌ చేస్తూ పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు దోచుకుంటున్నాయి అని వాపోతున్నాయి. దీనిపై తమ గోడు ఎవరితో వెల్లబోసుకోవాలని అని నిలదీస్తున్నాయి. ఇది ఎంత వరకు న్యాయం ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే తమ జీతమే అదో గతి అయ్యేలా ఉందని ఉద్యోగ సంఘాలు తమ గోడు వెల్లబోసుకున్నాయి. తెలంగాణలో ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి ప్రతినెలా దాదాపు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు నష్టపోతున్నారు.

ఇదీ చదవండి: Holi Hangover: హోలీ రంగులతో ముఖం డల్‌గా మారిందా? ఈ 5 స్కిన్‌ కేర్‌ టిప్స్‌ మీకోసం..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

...Read More

Trending News