Telangana Gazetted Employees Meeting: ప్రధానంగా తమకు రావాల్సిన 5 డీఏలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ ఉద్యోగ గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయ ,కార్మిక పెన్షనర్ల, ఐక్య కారణ సమితి నిర్వహించనుంది. సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదికగా హైదరాబాద్‌లో ఆదివారం 4వ తేదీ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఇందులో తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు కార్మికులు, పెన్షనర్లు రాష్ట్రస్థాయి ఉద్యోగుల పాల్గొననున్నారు.
ఇక ఎప్పటినుంచో తెలంగాణలో ఐదు డిఏలు పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఒక విధంగా చెప్పాలంటే మన రాష్ట్రంలోనే ఎక్కువగా డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఇటీవలే రేవంత్ రెడ్డి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా ఉందని వ్యాఖ్యానించిన సంగతి కూడా తెలిసిందే.
ఉద్యోగులు మాత్రం ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డీఏల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగుల డీఏ 26.39 శాతం మాత్రమే ఉంది. ప్రధానంగా 2022 తేదీ నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి ఉద్యోగులకు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఫించను దారులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు.
ఇది కాకుండా జులై 1వ తేదీ 2020 నుంచి పీఆర్సీ కూడా అమలులోకి రావాల్సి ఉంది. ఈయన నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పింఛనుదారులు తీవ్ర ఆగ్రహంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నారు. అసంతృప్తిని వెల్లడించడానికి ఉద్యోగులు ఎన్నో రోజులుగా నిరసనలు సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఆదివారం జరగనున్న ఈ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ, రాష్ట్రస్థాయి ఉద్యోగ సదస్సులో కూడా పెండింగ్‌లో ఉన్న 5 డీఏలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేయనున్నాయి. అంతేకాదు తమ బకాయి బిల్లులు వెంటనే విడుదల చేయాలి. ఇక 51 శాతం ఫిట్మెంట్ కూడా వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉన్నది ఆ నివేదికను కూడా అమలు చేయాలని వాళ్ళు కోరనున్నారు.
చాలా ఇలా మొత్తం గా చాలా కాలంలో ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న 52 డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల చైర్మన్ జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించనున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డులు కూడా వెంటనే అమలు చేయాలని జీవో నంబర్ 317 సమీక్షించి బాధిత బదిలీల కొరకు సూపర్ న్యూమరికల్ పోస్టులు కల్పించి వీలైనంత త్వరగా వారి సమస్యలు జిల్లాల వారీగా పరిష్కరించాలని కోరనున్నారు.
ఇక పెండింగ్ లో ఉన్న డీఏల విషయానికి వస్తే 2022 జూలై 3.64%, 2023 జనవరి 3.64, జులై 3.64 మొత్తం మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక 2024 జనవరి 3.64, జులై 2.73, 2025 జనవరి 2.70, డీఏలు పెండింగ్‌లు ఉన్నాయి. అయితే 2022 జూలైకి సంబంధించిన 3.64% ప్రభుత్వం మొన్న మంజూరు చేసింది. దీంతో 5 డిఏ లు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి.
ఇదీ చదవండి: ఈ మొక్క పాములకు ముంగిస లాంటిది.. పైల్స్ సమస్యకు విరుగుడు..!
ఇదీ చదవండి: అయ్యబాబోయ్ ఎద్దు కూడా స్కూటీ నడుపుతోందే..? సీసీ టీవీ ఫూటేజ్ చూస్తే మీరే నోరెళ్లబెడతారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









