KCR: తెలంగాణ మాజీ సీఎంపై కేసీఆర్ పై హైకోర్టులో ఆసక్తికర పిటిషన్..

KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై హైకోర్టులో విచిత్రమైన పిటిషన్ దాఖలైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి డీలా పడ్డ గులాబి బాస్.. పార్లమెంట్  ఎన్నికల్లో సాంతం కనిపించకుండా పోయింది. మధ్యలో తుంటి ఎముక విరిగి హాస్పిటల్ లో జాయిన అయి రెస్ట్ తీసుకొని మళ్లీ ప్రజల్లోకి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా బీఆర్ఎస్ భవన్ లో కార్యకర్తలతో సమావేశమయ్యారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 22, 2025, 10:31 AM IST
KCR: తెలంగాణ మాజీ సీఎంపై కేసీఆర్ పై హైకోర్టులో ఆసక్తికర పిటిషన్..

KCR: BRS అధినేత కేసీఆర్‌ అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడాన్ని సవాలు చేస్తూ గురువారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ అసెంబ్లీకి హాజరయ్యేలా తగిన చర్యలు తీసుకునేలా స్పీకర్, శాసన సభాపతి కార్యాలయానికి ఆదేశాలివ్వాలని కోరుతూ... తెలంగాణ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డి.విజయ్‌పాల్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు.

Add Zee News as a Preferred Source

2023 డిసెంబరు 16న ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్‌ (కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు) ఇప్పటి వరకు అసెంబ్లీకి రాకున్నా శాసన సభాపతి, స్పీకర్‌ కార్యాలయం తగిన ప్రొసీడింగ్స్‌ చేపట్టలేదన్నారు. ప్రజల గళాన్ని అసెంబ్లీలో వినిపించడానికి ఎమ్మెల్యేలకు వేతనాలను కూడా పెంచారని చెప్పారు.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.

ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ విధులు నిర్వహించలేకపోతే ఆ బాధ్యతల నుంచి తప్పించి, కొత్త వారిని ఎంపిక చేసేందుకు BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరారు. కోర్టు ముందుకు మొదటిసారి ఇలాంటి పిటిషన్‌ వచ్చిందని, శాసన వ్యవస్థ, అధికారులు తీసుకునే రాజకీయ, ఆర్థిక నిర్ణయాలను సమీక్షించే విస్తృతాధికారం న్యాయ వ్యవస్థకు ఉందని పేర్కొన్నారు. ఇందులో ప్రతివాదులుగా స్పీకర్, శాసన సభాపతి కార్యాలయంతోపాటు కేసీఆర్, కేటీఆర్‌లను పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది

ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..

ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News